టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind) తాజాగా ఐటీ ఆఫీస్ లో ప్రత్యక్షమవడం అందరికీ షాక్ ఇచ్చింది. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలి ట్రానిక్స్ వారి రూ.100 కోట్ల స్కాములో భాగంగా అల్లు అరవింద్ (Allu Aravind) పేరు ఉండటంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగి.. అల్లు అరవింద్ (Allu Aravind) విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు పంపారు. దీంతో అల్లు అరవింద్ ను దాదాపు 3 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారని తెలుస్తుంది.
Allu Aravind
అల్లు అరవింద్ (Allu Aravind) ఈ విషయంపై స్పందిస్తూ.. “నేను 2017 లో ఓ ప్రాపర్టీ కొన్నాను. అందులో ఒక మైనర్ వాటా ధరుడు భాగం ఉంటే అది నేను కొన్నాను. అయితే అందులో ఈడీ ప్రాబ్లమ్ ఏదో ఉంది. అతను బ్యాంకు లోన్ తీసుకుని అది కట్టలేదు. అందుకే అతని పై ఈడీ ఎంక్వైరీ ఉంది. దీంతో ఆ స్థలం విషయంలో నా పేరు కూడా జోడించారు. అందుకే నన్ను పిలిచారు. వచ్చి నేను బాధ్యతగా వచ్చి నా వివరణ ఇచ్చాను. అంతకు మించి ఏమీ లేదు.
కానీ మీడియాలో దీనిని పెద్దగా చేసి చూపిస్తున్నారు. నేను వెళ్లి ఈడీ విచారణలో పాల్గొని నా వివరణ ఇచ్చాను. అంతకు మించి.. కేసు నడుస్తున్నప్పుడు నేను ఏమీ చెప్పకూడదు” అంటూ క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. వచ్చే వారం కూడా అల్లు అరవింద్ (Allu Aravind) ఈడీ విచారణకు హాజరు కావాలి. అల్లు అరవింద్ చివర్లో చెప్పిన మాటలను బట్టి కూడా ఇది స్పష్టమవుతుంది.