తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో చిరంజీవి, రజినీకాంత్ లాంటి ఒకప్పటి అగ్ర హీరోలతో పాటు అల్లు అర్జున్, రామ్ చరణ్, నాని లాంటి ఈ తరం హీరోలతో కూడా అల్లు అరవింద్ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకి గాను అతడు చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం అతడిని సత్కరించనుండి. ఈ నెల 20న ఢిల్లీలో విజ్ఞానభవన్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయన్ను ‘ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ 2019’ పురస్కారంతో గౌరవించనున్నారు.
భారతరత్న పురస్కార గ్రహీత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డు ని అందించనున్నారు. సమాజ సేవ చేస్తూ, సామాజిక అభివృద్ధికి తోడ్పడే వ్యక్తులకు ఈ పురస్కారం ఇస్తారు. అల్లు అరవింద్ తో పాటు నలుగురు ముఖ్యమంత్రులు, క్రీడాకారులు, మరికొందరు ఈ పురస్కారం అందుకోనున్నారు. జస్టిస్ కె.జి. బాలకృష్ణన్, జస్టిస్ జ్ఞానసుధ సుభ్యులుగా ఉన్న జ్యూరీ అల్లు అరవింద్ కి ఈ పురస్కారం అందించాలని నిర్ణయించుకుంది.