మెగాస్టార్ చిరంజీవి- మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న రిలీజ్ అయ్యింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఆ చిత్రం ఫలితాన్ని అందరూ మర్చిపోయినా.. ఫైనాన్సియల్ సెటిల్ మెంట్ల గొడవలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో మునుపెన్నడూ లేని విధంగా దర్శకుడు పై బయ్యర్లు నష్టాలు తీర్చాలి అని ఒత్తిడి తేవడం హాట్ టాపిక్ అవుతుంది.
అసలు బయ్యర్లు కొరటాల శివ నే ఎందుకు నష్టాలు భర్తీ చేయమని ..ఒత్తిడి చేస్తున్నారు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. దానికి సమాధానం కూడా ఆల్రెడీ బయటకు వచ్చింది. కెరీర్ ప్రారంభం నుండి థియేట్రికల్ బిజినెస్ వ్యవహారాల్లో కొరటాల తలదూరుస్తుంటారని.. కానీ అన్ని సినిమాలు హిట్ అయ్యి డబ్బులు రావడం వలన ఇలాంటి గొడవల్లో కొరటాల గతంలో చిక్కుకోలేదని ప్రచారం జరిగింది. ఇప్పుడు ‘ఆచార్య’ ప్లాప్ అయ్యింది కాబట్టి బుక్కైపోయాడు అని ప్రచారం జరుగుతుంది.
నిజమే అందుకే కొరటాల కూడా ఈ విషయంలో ఎస్కేప్ అవ్వాలి అని చూడడం లేదు. తనకి చెందిన స్థలాన్ని అమ్మేసి తీర్చడానికి కూడా రెడీ అయ్యాడు. కొంత శాతం తన నెక్స్ట్ సినిమా థియేట్రికల్ రైట్స్ రూపంలో తీరుస్తాను అని కూడా అతను బయ్యర్లకి చెబుతున్నట్టు భోగట్టా. అయినా కొంతమంది కరగక పోవడం వలన సీన్లోకి అల్లు అరవింద్ ఎంటర్ అయినట్టు ప్రచారం జరుగుతుంది.
ఈ విషయంలో ఎంత వరకు నిజముంది అనేది తెలీదు కానీ.. ఒకవేళ ఇది నిజమే అయితే కనుక కొరటాల సమస్యలు తీరిపోయినట్లే అనే సమాధానాలు కూడా వినిపిస్తున్నాయి. మరోపక్క చిరు సినిమాలకు ఏమైనా సమస్యలు వస్తే.. అల్లు అరవింద్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చి చక్రం తిప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.