Pushpa 2 The Rule: ‘దంగల్‌’ని దాటేస్తుందట.. ఆ రికార్డు బద్దలుకొట్టే సినిమా కావాలట!

విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లకుపైగా వసూళ్లతో దూసుకుపోతున్నడు ‘పుష్ప’రాజ్‌ (Pushpa). ఇటీవలే రూ.1002 కోట్లు అంటూ ఘనంగా పోస్టర్‌ను కూడా లాంచ్‌ చేశారు. దీంతో సినిమా లాంగ్‌ రన్‌ అయిపోయిందేమో.. ఇక ఇలాంటి పోస్టర్లు రావేమో అని కొందరు అనుకుంటుండగా.. మా జోరు విషయంలో ఆగేది లేదని టీమ్‌ స్పష్టం చేసింది. ఆ జోరు చూస్తుంటే రూ. 2000 కోట్ల పోస్టర్‌ కూడా వచ్చేలా ఉంది. సినిమాకు అందించిన భారీ విజయాన్ని ప్రజల మధ్య సంబరంలా జరుపుకోవడానికి దిల్లీ వెళ్లాడు.

Pushpa 2 The Rule

ఎప్పటిలానే తన సినిమా గురించి, సినిమాకు కారణమైన వాళ్ల గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో సినిమా వసూళ్ల గురించి మాట్లాడాడు బన్నీ (Allu Arjun). ఇలా కొత్త రికార్డులు నమోదవుతూనే ఉండాలి.. బద్దలవుతూనే ఉండాలి అని పరిశ్రమలో పోటీతత్వం గురించి మాట్లాడాడు. అంతేకాదు వేసవిలోపు తెలుగు సినిమా అనే కాకుండా, ఇతర ఏ భాష నుండి అయినా ఓ సినిమా వచ్చి ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2: The Rule)   రికార్డులను బ్రేక్‌ చేయాలని కోరుకుంటున్నా అని చెప్పాడు బన్నీ.

అలాగే తమ సినిమా రూ.2 వేల కోట్ల మైలురాయిని చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు నిర్మాతలు. దీంతో రూ. 2000 కోట్ల పోస్టర్‌ పక్కాగా వస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుత జోరు చూస్తుంటే రెండో వారాంతంలో ఇది జరిగేలా ఉంది. ఇప్పటివరకు ఇండియన్‌ సినిమా ఈ గౌరవం అందుకున్న ఏకైక సినిమా ‘దంగల్‌’.

ఆమిర్‌ ఖాన్‌ నటించిన ఈ సినిమాకు ఆ స్థాయి విజయం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఆ స్థాయి విజయం అందుకుంది. ఇప్పుడు బన్నీ ఆ రికార్డును అందుకుంటాడేమో చూడాలి. ఒకవేళ అదే జరిగితే దానిని బద్ధలు కొట్టడం దాదాపు అసాధ్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినంత హైప్‌, టికెట్‌ రేట్లు తర్వాతి రోజుల్లో వస్తాయా అనేది అనుమానమే.

 గేమ్ చేంజర్.. యూఎస్ లో ఈ టార్గెట్ సాధ్యమేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus