Allu Arjun: అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ లో కుటుంబంతో కలసి సందడి చేసిన అల్లు అర్జున్!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈయన తన భార్య అల్లు స్నేహ కూతురు కొడుకుతో కలిసి అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ ను సందర్శించారు.ఇలా అల్లు అర్జున్ ఫ్యామిలీ అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ కి వెళ్లి ప్రత్యేక పూజలు పాల్గొన్నట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోని ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ కి షూటింగ్ సమయంలో ఏమాత్రం విరామ సమయం దొరికిన వెంటనే తన భార్య పిల్లలతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈసారి అల్లు అర్జున్ తన భార్య పిల్లలతో కలిసి పంజాబ్ లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలను నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి పుష్ప 2 షూటింగ్ తో బిజీ కానున్నారు. అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించనున్నారు. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ కి ఆడియన్స్ మాత్రమే కాకుండా స్టార్ సెలబ్రిటీలు సైతం అభిమానులుగా మారిపోయారు. ఇక ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ద్వారా బన్నీ ఎలాంటి రికార్డులను సృష్టిస్తారో తెలియాల్సి ఉంది.

1

2

3

4

5

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus