Allu Arjun: వామ్మో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆస్తుల విలువ ఇన్ని రూ.కోట్లా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిదానంగా సినిమాలు చేస్తున్నా ఆ సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప1 సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ పుష్ప2 సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంటానని నమ్మకం కలిగి ఉన్నారు. బన్నీ ఆస్తుల విలువ అంతకంతకూ పెరుగుతుండటం సోషల్ మీడియాలో గమనార్హం. అల్లు అర్జున్ ఆస్తుల విలువ 400 కోట్ల రూపాయల నుంచి 500 కోట్ల రూపాయలు అని సమాచారం.

బన్నీ ప్రస్తుతం 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. బన్నీ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను సైతం ప్రకటించనున్నారు. బన్నీ కెరీర్ ప్లానింగ్ ను చూసి ఇతర హీరోలు సైతం షాకవుతున్నారు. రాజమౌళి సపోర్ట్ లేకుండా బన్నీ పాన్ ఇండియా హీరోగా ఎదగటం గమనార్హం. బన్నీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసేలా తర్వాత ప్రాజెక్ట్ లు ఉండాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అల్లు అర్జున్ పాన్ వరల్డ్ హీరోగా ఎదిగే దిశగా అడుగులు వేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అల్లు అర్జున్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. బన్నీ వయస్సు పెరుగుతున్నా సినిమా సినిమాకు మరింత యంగ్ గా కనిపిస్తుండటం గమనార్హం. బన్నీ సినిమాల కోసం తన లుక్ ను మార్చుకుంటూ అందరినీ ఒకింత ఆశ్చర్యపరుస్తూ ఉండటం గమనార్హం.

అల్లు అర్జున్ (Allu Arjun) కు మల్టీస్టారర్స్ లో అవకాశాలు వస్తున్నా ఆ సినిమాలను బన్నీ రిజెక్ట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ శాకుంతలం సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. శాకుంతలం సినిమాలో అల్లు అర్హ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని సమాచారం అందుతోంది. అల్లు అర్హ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే ఈ చిన్నారికి ఆఫర్లు పెరిగే అవకాశం ఉంటుంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus