Allu Arjun: అలాంటి పాత్ర దొరకదంటున్న బన్నీ!

స్టార్ హీరో బన్నీ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. బన్నీ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆర్య సక్సెస్ సాధిస్తే ఆర్య2 మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఫ్లాప్ అయింది. అయితే పుష్ప సినిమాతో బన్నీ, సుకుమార్ కచ్చితంగా సక్సెస్ సాధిస్తారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. పుష్ప అనే టైటిల్ వల్ల కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

అయితే ఈ సినిమాకు పుష్ప టైటిల్ ఫిక్స్ చేయడం వెనుక గల కారణాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో బన్నీ చెప్పుకొచ్చారు. నేను, సుకుమార్ మొదటినుంచి ఈ టైటిల్ కు కట్టుబడి ఉన్నామని మొండివాడైన అబ్బాయికి ఈ టైటిల్ పెడితే ఎలా ఉంటుందని భావించామని బన్నీ తెలిపారు. పుష్ప అమ్మాయి పేరు కావడంతో మొదట టైటిల్ ను రివీల్ చేస్తే ప్రేక్షకులు నిరుత్సాహపడే ఛాన్స్ ఉందని భావించానని బన్నీ పేర్కొన్నారు. ఆ రీజన్ వల్లే టైటిల్ లో పాటు లుక్ ను కూడా విడుదల చేశామని బన్నీ చెప్పుకొచ్చారు.

సినిమాను స్టార్ట్ చేసే సమయంలోనే రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని అనుకున్నామని బన్నీ వెల్లడించారు. పెద్ద స్పాన్ ఉన్న కథ కావడంతో కథకు న్యాయం చేయడానికి రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని బన్నీ పేర్కొన్నారు. పుష్ప సినిమాలోని పాత్ర నేల మాస్ పాత్ర అని బన్నీ కామెంట్లు చేశారు. కెరీర్ లో ఈ సినిమాను మించి గొప్ప మాస్ క్యారెక్టర్ దొరుకుతుందని తాను భావించడం లేదని బన్నీ పేర్కొన్నారు.

రిలీజ్ కు వారం ముందు వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగడంతో ప్రమోషన్స్ కు తక్కువ సమయం కేటాయించామని బన్నీ తెలిపారు. రాజమౌళి గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మనస్సులో ఉన్న మాటలను చెప్పారని మా మధ్య చాలా సందర్భాల్లో సినిమా గురించి చర్చ వచ్చిందని బన్నీ కామెంట్లు చేశారు.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus