టాలీవుడ్ స్టార్ హీరోలైన రామ్ చరణ్ (Ram Charan) , అల్లు అర్జున్ (Allu Arjun) మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ ఇద్దరు హీరోల కాంబినేషన్ లో తెరకెక్కిన ఎవడు మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ కాంబినేషన్ లో చరణ్ అర్జున్ అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కించాలని అల్లు అరవింద్ ఆకాంక్ష కాగా భవిష్యత్తులో ఆయన కోరిక తీరుతుందేమో చూడాలి. పుష్ప ది రూల్ (Pushpa2) టీజర్ బన్నీ ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చేయగా టీజర్ లో డైలాగ్ ఉండి ఉంటే బాగుండేదని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
గతంలో ఒక సందర్భంలో అల్లు అర్జున్ రామ్ చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. చరణ్ అంటే ప్రాణమని ప్రాణం కంటే ఎక్కువ అని బన్నీ చెప్పుకొచ్చారు. ఒక హీరోగా నేను రామ్ చరణ్ అభిమానినని మెగాస్టార్ (Chiranjeevi) తర్వాత ఆ స్థానంలో రామ్ చరణ్ ను చూడాలని అనుకుంటున్నానని ఆయన కామెంట్లు చేశారు. మెగాస్టార్ స్థానం చరణ్ దే అని బన్నీ పేర్కొన్నారు.
25 సంవత్సరాల పాటు ఆ స్థానం చరణ్ దే కావాలని కోరుకుంటున్నానని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. వైరల్ అవుతున్న వీడియో ఓల్డ్ వీడియో కాగా ఈ వీడియో విషయంలో బన్నీ అభిమానులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరో స్టార్ హీరో గురించి ఇంత గొప్పగా కామెంట్ చేయడం అల్లు అర్జున్ కే సాధ్యమని అభిమానులు చెబుతున్నారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీలు అల్లు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
హ్యాపీ బర్త్ డే బావ అంటూ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అల్లు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి సమయంలో బన్నీ అభిమానులు ఆయన ఇంటి దగ్గర సందడి చేశారు. నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత బన్నీ జరుపుకుంటున్న తొలి పుట్టినరోజు కావడంతో ఈ పుట్టినరోజు బన్నీ ఫ్యాన్స్ కు మరింత ప్రత్యేకం అని చెప్పవచ్చు. చరణ్, బన్నీ కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.