Allu Arjun, Priyamani: ప్రియమణి పై అల్లు అర్జున్ హాట్ కామెంట్స్.. తగ్గేదే లే..!

‘పుష్ప’ ప్రమోషన్స్ కోసమో ఏమో కానీ ఈ మధ్య బన్నీ వరుస ఈవెంట్ లకు హాజరవుతున్నాడు. మొన్నటికి మొన్న ‘వరుడు కావలెను’ ‘పుష్పక విమానం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లకి హాజరైన బన్నీ… మొన్నటికి మొన్న బాలకృష్ణ ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సందడి చేసాడు. అంతేకాదు బుల్లితెర పై ఢీ-13 కోసం కూడా బన్నీ గెస్టుగా హాజరయ్యాడు. బన్నీ వచ్చిన ఎపిసోడ్లో మొత్తం ఆయన పాటలకే డ్యాన్స్ చేసారు కంటెస్టెంట్లు.మధ్య మధ్యలో తగ్గేదే లే అన్నట్టు బన్నీ తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో ఆకట్టుకున్నాడు.

యాంకర్ ప్రదీప్… ‘ఎవరైనా డ్యాన్స్ బాగా చేస్తే ప్రియమణి గారు హగ్ ఇస్తారు..ఇంకా బాగా డ్యాన్స్ చేస్తే పూర్ణ గారు బుగ్గ కొరుకుతారు’ అంటూ కామెంట్ చేసాడు. దీనికి బన్నీ ‘ఇంకా బాగా డ్యాన్స్ చేస్తే?’ అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలా కామెంట్ చేసాడు. దాంతో అందరూ తెగ నవ్వుకున్నారు. ఇక అటు తర్వాత ప్రియమణి ‘నా బ్యాడ్ లక్ అనుకుంట… అల్లు అర్జున్ తో నటించలేకపోయాను. ఆ బాధ ఇప్పటికీ ఉంది’ అంటూ తన మనసులోని మాటని బయటపెట్టింది.

అందుకు బన్నీ… “ఇప్పటికీ ఛాన్స్ ఉంది. పైగా ఇప్పుడు బాగా సన్నబడి హాట్ గా తయారయ్యావు కదా” అంటూ అల్లు అర్జున్ అనడంతో పక్కనే ఉన్న పూర్ణతో సహా సెట్ లో ఉన్న వాళ్లంతా పడి పడి నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!


‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus