Allu Arjun: భార్యతో బన్నీ డేట్ నైట్.. ఫొటోలు వైరల్!

టాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. ఒక్కో సినిమాతో తన ఇమేజ్ ను పెంచుకుంటూ వస్తున్నారు. మెగాఫ్యామిలీలో అల్లు అర్జున్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇటీవల విడుదలైన ‘పుష్ప’ సినిమాతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నారు బన్నీ. నార్త్ ఆడియన్స్ లో బన్నీ డిమాండ్ బాగా పెరిగిపోయింది. తన సినిమాలతో బిజీగా ఉండే అల్లు అర్జున్.. కాస్త సమయం దొరికినా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు.

తరచూ తన భార్యా, పిల్లలను తీసుకొని ట్రిప్స్ కి వెళ్తుంటారు. వారికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. బన్నీ భార్య స్నేహారెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఈమె కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. చాలావరకు అల్లు అర్జున్ కి సంబంధించిన విషయాలను ఆమె షేర్ చేస్తుంటారు. దీంతో ఈమెకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. రీసెంట్ గా ఈమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని స్టోరీస్ పంచుకుంది.

అందులో తన భర్త అల్లు అర్జున్ తో కలిసి తను డేట్ నైట్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోల్లో అల్లు అర్జున్ వైన్ తాగుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించారు. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారడంతో ఆయన అభిమానులు తెగ లైకులు, కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ పార్ట్ 2తో బిజీగా ఉన్నారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పార్ట్ 1కి మించి ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

1

2

3

4

5

6

7

8

9

10

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus