వ్యక్తిగత డ్రైవర్ కు ఆర్థిక సాయం చేసిన బన్నీ.. ఎందుకంటే?

సినిమా ఇండస్ట్రీలో ఉండే కొందరు హీరోలు కేవలం సినిమా జీవితంలో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా హీరోలు అనిపించుకుంటారు. వ్యక్తిగత జీవితంలో ఎంతో మందికి సహాయం చేస్తూ వారి మంచి మనసును చాటుకుంటారు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం తాను చేసే సహాయం మరొకరికి తెలియకుండా ఆపదలో ఉన్న వారికి అడగకుండానే సహాయం చేస్తూ తన మంచి మనసు చాటుకుంటున్నారు.

ఈ క్రమంలోనే కేరళ విద్యార్థికి సహాయం చేయమని కలెక్టర్ విన్నవించుకోక బన్నీ మాత్రం ఏకంగా ఆ అమ్మాయిని దత్తత తీసుకొని తన చదువు బాధ్యతలని తనపై వేసుకున్నారు. ఇలా తన చదువు బాధ్యతలను అల్లు అర్జున్ తీసుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయం మర్చిపోకముందే మరోసారి బన్నీ తన మంచి మనసు చాటుకున్నారు. మహిపాల్ ఎన్నో సంవత్సరాలుగా తన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నటువంటి కారు డ్రైవర్ మహిపాల్ అనే వ్యక్తి ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నారు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తనని తన వ్యక్తిగత డ్రైవర్ గా నియమించుకున్నారు.ఇకపోతే మహిపాల్ కోసం అల్లు అర్జున్ భారీ ఆర్థిక సహాయం చేసినట్టు తెలుస్తుంది. మహిపాల్ బోరబండలో సొంత ఇల్లు కట్టుకుంటున్నారు. అయితే ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ తన డ్రైవర్ కోసం ఏకంగా 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

ఇలా అల్లు అర్జున్ తమ ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం చేయడంతో మహిపాల్ దంపతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసిన బన్నీ ఫాన్స్ అతని మంచి మనసుకు ఫిదా అవుతున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus