Pushpa3: మొత్తానికి అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చేశాడు!

అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2 ‘ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దేశం మొత్తం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ముఖ్యంగా నార్త్ లో ‘పుష్ప 2 ‘ కోసం ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం ‘పుష్ప'(ది రైజ్) అక్కడ సూపర్ హిట్ అయ్యి.. రూ.108 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ ను సాధించిన సంగతి తెలిసిందే. రెండో భాగం అక్కడ రూ.500 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్సులు ఉన్నాయని ట్రేడ్ పండితులు కూడా అంచనా వేస్తున్నారు.

ఇక దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 న విడుదల చేయాలని భావిస్తున్నాడు. మరోపక్క ‘పుష్ప 3 ‘ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ ప్రచారం గురించి అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చాడు. జర్మనీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 74వ బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్ గా హాజరవ్వడం జరిగింది.

అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ముందుగా భారతీయ సినీ ప్రాముఖ్యత గురించి గొప్పగా మాట్లాడిన బన్నీ అటు తర్వాత తాను నటిస్తున్న (Pushpa3) ‘పుష్ప-3’ సినిమా గురించి కూడా స్పందించాడు.

‘ఫస్ట్ పార్ట్ కంటే కూడా సెకండ్ పార్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీరు థర్డ్ పార్ట్ కూడా ఆశించవచ్చు. దీనిని ఫ్రాంచైజీగా మార్చాలని అనుకుంటున్నాం’ అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus