Allu Arjun: దిల్‌ రాజుతో సినిమా విషయంలో బన్నీ నిర్ణయానికి వచ్చేశాడా?

దిల్‌ రాజు ప్రొడక్షన్‌ హౌస్‌తోనే అల్లు అర్జున్‌కి స్టార్‌ హోదాకి ఎంట్రీ పాస్‌ వచ్చింది. ‘గంగోత్రి’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్‌ ‘ఆర్య’ సినిమా దిల్‌ రాజు నిర్మాతగానే వచ్చింది. దీంతో బన్నీ కెరీర్‌లో దిల్‌ రాజు హ్యాండ్‌ భారీగానే ఉందని చెబుతారు. అలాంటి ఆయన కోసం బన్నీ సినిమా చేయకుండా ఎందుకు నానుస్తున్నాడు. సినిమా ఓకే అయి అనౌన్స్‌ చేసినా.. ఇంతవరకు ఎందుకు స్టార్ట్‌ చేయడం లేదు అనే ప్రశ్న వినిపిస్తోంది.

ఇటీవల బన్నీ కొత్త సినిమా అనౌన్స్‌ అయ్యేసరికి మరోసారి బన్నీ – దిల్‌ రాజు చర్చ మొదలైంది. ‘ఆర్య’ సినిమా తర్వాత దిల్‌ రాజు – బన్నీ కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చాయి. ‘పరుగు’, ‘డీజే’ రూపంలో ఈ కాంబోలో సినిమాలొచ్చాయి. అయితే సెకండ్‌ హ్యాట్రిక్‌ ఎప్పుడు స్టార్ట్‌ చేస్తారా అని అనుకుంటుండగా ‘ఐకాన్‌’ పేరుతో ఓ సినిమా అనౌన్స్‌ అయ్యింది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందనుందని కూడా చెప్పారు.

ఆ తర్వాత చాలాసార్లు ఈ సినిమా ఉందని, లేదని, అదిగో, ఇదిగో అంటూ వార్తలొచ్చాయి. అయితే తన లైనప్‌లో ఈ సినిమా పేరు చెప్పకుండా వార్తలొస్తున్నాయి. దీంతో దిల్‌ రాజు సినిమా ఉందా లేదా అనే చర్చ మొదలైంది. నిజానికి దిల్‌ రాజుకు సినిమా చేయాలని అల్లు అర్జున్‌ అనుకోవడం లేదా? లేక సరైన దర్శకుడు దొరకడం లేదా అనేది తెలియాల్సి ఉంది. దిల్‌ రాజుకు ఒకవేళ దర్శకుడు దొరకకపోతుంటే..

అల్లు అర్జున్‌ దగ్గరకు వచ్చే దర్శకుడినైనా ఆ బ్యానర్‌లో చేయొచ్చు. ఇంత అవకాశం ఉన్నా ఎందుకు దిల్‌ రాజుకు సినిమా చేయడం లేదు అనేది ఇక్కడ ప్రశ్నగా మిగిలిపోయింది. బన్నీ సినిమాల సంగతి చూస్తే.. ‘పుష్ప 2’ సినిమా తర్వాత త్రివిక్రమ్‌ సినిమా ఉంటుంది, ఆ తర్వాత సందీప్‌ రెడ్డి వంగా సినిమా ఉంటుంది. మరోవైపు ఇటీవల దిల్‌ రాజు – అల్లు అరవింద్‌ మధ్య ఇటీవల పొరపొచ్చాలు వచ్చాయనే వార్తలూ వచ్చిన విషయం తెలిసిందే.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus