అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప 2’ (Pushpa 2) డిసెంబర్ 5న విడుదల కాబోతోంది. ‘పుష్ప’ (Pushpa) సినిమా 2021 డిసెంబర్లో రిలీజ్ అయ్యింది. అంటే అల్లు అర్జున్ (Allu Arjun) నుండి సినిమా వచ్చి 3 ఏళ్ళు పూర్తికావస్తున్నట్టే..! అల్లు అర్జున్ ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తూ ఉంటాడు. ఒక్కో సినిమాకు రూ.50 కోట్లు అందుకుంటాడు. ‘పుష్ప 2’ కి 3 ఏళ్ళు టైం పట్టింది. కాబట్టి.. ఈ సినిమా కోసం అతని రూ.150 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్టే అని చెప్పాలి.
Allu Arjun
ఈ సినిమాకు రూ.900 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అలా చూసుకుంటే అల్లు అర్జున్ భారీ పారితోషికం ఏమీ అందుకోలేదనే చెప్పాలి. ‘మైత్రి’ మూవీ మేకర్స్ ఈ సినిమాతో భారీ లాభాలు పొందారు. అన్ని ఏరియాలు కూడా ఔట్ రైట్ గా అమ్మేశారు. ఏదేమైనా అల్లు అర్జున్ 3 ఏళ్ళ పాటు ఒకే సినిమాపై ఉండటం వల్ల.. ఇప్పుడు అతని మార్కెట్ ను బట్టి అయితే ఓ రూ.70 కోట్లు పోగొట్టుకున్నట్టే.!
అందుకే ఇక నుండి రెండేళ్లకు 3 సినిమాలు చేసుకునేలా బన్నీ ప్లాన్ వేసుకుంటున్నాడట. అలా చేసుకుంటే బన్నీ రూ.250 కోట్ల నుండి రూ.300 కోట్ల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అయితే త్రివిక్రమ్ తో (Trivikram) బన్నీ నెక్స్ట్ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇది మైథలాజికల్ టచ్ తో కూడుకున్న సినిమా.
పాన్ ఇండియా లెవెల్లో రూపొందనుంది. కాబట్టి ఏడాదిన్నర పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహించాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించాలని ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వాళ్ళు భావిస్తున్నారు. అలా చూసుకుంటే బన్నీ నుండి వచ్చే రెండేళ్లలో 3 సినిమాలు రావడం కష్టం.