అల్లు అర్జున్ కథానాయకుడుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ అండ్ పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘పుష్ప ది రైజ్’ పేరుతో డిసెంబర్ 17న విడుదల కాబోతోంది. ఆల్రెడీ విడుదల చేసిన ప్రోమోలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన పాటలకి కూడా ప్రేక్షకుల నుండీ మంచి స్పందన లభించింది.
‘అఖండ’ తో ఇండస్ట్రీకి మళ్ళీ పూర్వవైభవం నెలకొంటున్న తరుణంలో ‘పుష్ప’ దానిని డబుల్ చేసేలా ఉంటుందని ఇండస్ట్రీ అంతా ఆశపడుతోంది. ఇక ప్రమోషన్లను కూడా వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ట్రైలర్ ను డిసెంబర్ 6న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన చిత్ర బృందం దానికి సంబంధించి చిన్న టీజర్ ను కూడా విడుదల చేసింది. 26 సెకండ్ల నిడివి గల ఈ టీజ్ లో చాలా అంశాలను చూపించాడు దర్శకుడు సుకుమార్. ఇందులో అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక కూడా కనిపిస్తుంది.
ఫారెస్ట్ లో యాక్షన్ సీక్వెన్స్ అలాగే వాటర్లో ఫైట్, ఎర్రచందనం స్మగ్లింగ్, పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ ను కొట్టడం వంటి అంశాలను చూపిస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. అంతేకాకుండా అనసూయ నోట్లో బ్లేడ్ పెట్టుకుని.. ఓ విలన్ గా నటిస్తున్న సునీల్ ను బెదిరిస్తోంది. అలాగే అజయ్, ధనుంజయ వంటి వారు కూడా కనిపిస్తున్నారు. సినిమాటోగ్రఫీ అలాగే బిజియం ఓ రేంజ్లో ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :