Pushpa Trailer: వర్త్ వెయిట్ అనిపించిన ‘పుష్ప’ ట్రైలర్…!

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’.ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఇంకో 4,5 రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది.డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా మొత్తం 5 భాషల్లో ‘పుష్ప’ ని విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలైన ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ప్రకటించారు. దాంతో మరోపక్క ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేయాలని ‘పుష్ప’ టీం భావిస్తోంది.ఇందులో భాగంగా డిసెంబర్ 6న సోమవారం నాడు(ఈరోజు) పుష్ప ట్రైల‌ర్ ను రిలీజ్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు.

కానీ అనివార్య కార‌ణాల‌తో ట్రైల‌ర్ ను అనౌన్స్ చేసిన టైంకి విడుద‌ల చేయ‌లేక‌పోతున్నామ‌ని.. ఫ్యాన్స్‌కు సోషల్ మీడియా ద్వారా క్ష‌మాప‌ణలు చెబుతూ తెలియజేయడంతో అభిమానులకు ఓ రేంజ్లో చిర్రెత్తు కొచ్చింది.దాంతో చాలా సేపు ట్రోల్ చేసి వాళ్ళు అలసిపోయిన టైములో ఇప్పుడు ట్రైలర్ ను విడుదల చేశారు. శేషాచలం , ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుండీ ప్రచారం జరుగుతూనే ఉంది. దానినే ట్రైలర్ ఓపెనింగ్ లో చూపించారు. సుకుమార్ సినిమాల్లో ఇప్పటివరకు రావు రమేష్ నటించలేదు మొదటి సారి ఈ చిత్రంలో నటిస్తున్నాడు.

ట్రైలర్ లో ఆయనకి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి. ఇక రంగస్థలం లో హీరోకి వినికిడి ప్రాబ్లం అయితే.. పుష్పలో హీరో గూని సమస్య. రష్మిక డీ గ్లామరస్ గా కనిపిస్తుంది. సునీల్ , అనసూయ , ధనుంజయ్ నెగిటివ్ పాత్రల్లో కనిపిస్తున్నారు. ‘ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా … ఫైరు’ అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ , దేవిశ్రీ బి. జి.యం , విజువల్స్ బాగున్నాయి. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus