గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో బన్నీ పేరు మారుమ్రోగుతోందనే సంగతి తెలిసిందే. అరుదైన రికార్డ్ లు అల్లు అర్జున్ (Allu Arjun) ఖాతాలో చేరుతుండటంతో బన్నీ ఫ్యాన్స్ సైతం తెగ సంతోషిస్తున్నారు. పుష్ప ది రూల్ (Pushpa 2) సినిమాకు అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. బన్నీకి జాతీయ అవార్డ్ రావడంతో పాటు బన్నీ నటనకు సైతం ఊహించని స్థాయిలో ప్రశంసలు దక్కాయి. మరోవైపు కొన్నిరోజుల క్రితం అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 25 మిలియన్లకు చేరింది.
సౌత్ ఇండియాలో ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న అతికొద్ది మంది హీరోలలో అల్లు అర్జున్ ఒకరు కావడం గమనార్హం. మరోవైపు దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే మార్చి నెల 28వ తేదీన రాత్రి 8 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్(Prabhas) , మహేష్ (Mahesh) మైనపు విగ్రహాలు ఏర్పాటు చేసినా ఆ విగ్రహాలు లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఉన్నాయి.
దుబాయ్ మ్యూజియంలో సౌత్ ఇండియా నుంచి మొట్టమొదటిసారి బన్నీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న తొలి టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కావడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. టాలెంట్ తో కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్న అల్లు అర్జున్ పుష్ప ది రూల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే టాలీవుడ్ నంబర్ వన్ హీరో అవుతారని అభిమానులు నమ్ముతున్నారు.
ఆగష్టు 15వ తేదీన పుష్ప ది రూల్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు ప్రమోషన్స్ మరీ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్స్ వస్తాయేమో చూడాలి.