Allu Arjun, Major Movie: మేజర్ గురించి బన్నీ అలా చెప్పారా?
- June 5, 2022 / 02:47 PM ISTByFilmy Focus
అడివి శేష్, సయీ మంజ్రేకర్, శోభిత కీలక పాత్రల్లో తెరకెక్కిన మేజర్ సినిమా భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మౌత్ టాక్ పాజిటివ్ గా ఉండటంతో ఈరోజు, రేపు ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉన్నాయి. ఫుల్ రన్ లో ఈ సినిమా భారీస్థాయిలో కలెక్షన్లను సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా నిర్మాతలలో మహేష్ బాబు కూడా ఒకరనే సంగతి తెలిసిందే.
అయితే తాజాగా మేజర్ సినిమాను వీక్షించిన బన్నీ ఈ సినిమా గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా విడుదల కాగా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. ట్విట్టర్ వేదికగా బన్నీ స్పందిస్తూ మేజర్ మూవీ గుండెకు హత్తుకుందని అడివి శేష్ మరోసారి మ్యాజిక్ చేశాడని కామెంట్లు చేశారు.

ప్రకాష్ రాజ్, రేవతి, శోభిత, సయీ మంజ్రేకర్ సినిమాకు చక్కని సపోర్ట్ అందించారని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ప్రతి భారతీయుడి గుండెను ఈ సినిమా హత్తుకుంటుందని బన్నీ కామెంట్లు చేశారు. ప్రేక్షకులకు ఇంత మంచి మూవీని అందించిన మహేష్ కు స్పెషల్ గా కృతజ్ఞతలు చెబుతున్నానని బన్నీ అన్నారు. బన్నీ ట్వీట్ కు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తున్నాయి. బన్నీ ప్రశంసలతో ఈ సినిమాకు కలెక్షన్లను మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

బన్నీ కూడా గతంలో దేశభక్తి బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కిన మేజర్ సినిమా స్క్రీన్ ప్లే సూపర్ అని నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ సాధించడంతో అడివి శేష్ ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. అడివి శేష్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కూడా సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Big congratulations to the entire team of #MajorTheFilm. A very heart touching film . Man of the show @AdiviSesh does his magic once again. Impactful support by @prakashraaj ji , Revathi , @saieemmanjrekar, #SobhitaDhulipala & all artists . Mind blowing Bsm by @SricharanPakala
— Allu Arjun (@alluarjun) June 4, 2022
మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

















