Allu Arjun: అక్కడ కూడా గొంతు వినిపిస్తున్న బన్నీ!

స్టార్ హీరోల జీవితాలు ఎంతో విలాసవంతంగా ఉంటాయని అభిమానులు భావిస్తున్నారు. అయితే స్టార్ హీరోలు ఎదిగే కొద్దీ ఒక్కో సినిమా కోసం పడే కష్టం అంతాఇంతా కాదు. సినిమాల్లో, రియల్ లైఫ్ లో స్టైలిష్ గా కనిపించే బన్నీ పుష్ప సినిమాలో మాత్రం షాకింగ్ లుక్ లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా కోసం బన్నీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. సుకుమార్ రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

పుష్ప పార్ట్1 డిసెంబర్ నెల 17వ తేదీన రిలీజ్ కానుంది. పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ ఇప్పటికే సిక్స్ ప్యాక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం తెలుగుతో పాటు మరో రెండు భాషల్లో బన్నీ డబ్బింగ్ చెప్పుకోనున్నారని సమాచారం. హిందీతో పాటు తమిళం లేదా కన్నడలో బన్నీ డబ్బింగ్ చెప్పే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. బన్నీ తీసుకున్న ఈ షాకింగ్ నిర్ణయాన్ని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఇతర భాషల్లో డబ్బింగ్ చెప్పడం సులువైన విషయం కాదు.

అయితే ఇతర భాషల్లో కూడా సత్తా చాటాలనే ముఖ్య ఉద్దేశంతోనే బన్నీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బన్నీ భవిష్యత్తు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కనున్న నేపథ్యంలో ఇతర భాషల్లో కూడా తన గొంతు వినిపించేలా బన్నీ ప్లాన్ చేసినట్టు బోగట్టా. బన్నీ కష్టానికి తగ్గ ఫలితం ఈ సినిమాతో దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. సుకుమార్ ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ల ద్వారా సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus