మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ “విజేత” చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. మంచి నటుడిగా కళ్యాణ్ దేవ్ పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం విజయోత్సవ వేడుకను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ కళ్యాణ్ బాగా నటించారని అభినందించారు. కళ్యాణ్ దేవ్ కి తండ్రిగా నటించిన మురళీ శర్మ కూడా చక్కని నటన ప్రదర్శించారని ప్రశంసించారు. అలాగే తన ఇంట్లో జరిగిన ఓ సంఘటన గురించి వెల్లడించారు.
“కళ్యాణ్ మా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిందని నాకు పంపాడు. ఆ సాంగ్ చాలా బాగుందని చెప్పాను. ఆ తర్వాత నేను ఊరెళ్లాను. ఊరు నుంచి వచ్చాక ఓ రోజున మా ఏడాదిన్నర పాప (అర్హ) కారు డెక్ మీద కొడుతూ “కొకొ..” అంటోంది. నాకు అర్ధం కాలేదు. “ఏమంటోంది’ అని నా భార్యను అడిగితే, ‘కళ్యాణ్ సినిమాలోని పాట “కొక్కొరోకో” పాట పెట్టమని అంటోంది” అని చెప్పింది. మా అబ్బాయికి కూడా ఆ పాట అంటే చాలా ఇష్టం” అంటూ అల్లు అర్జున్ వెల్లడించారు. చికెన్ పై వచ్చే ఈ పాట పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరినీ ఆకట్టుకుంటోంది.
#AlluArjun son #Ayaan’s reaction on the song Kokorokko from #Vijetha Movie!
A post shared by Filmy Focus (@filmyfocus) on