ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ రికార్డ్ గా నిలిచిన ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) ద్వారా బన్నీకి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ మరింత బలపడింది. ఈ సినిమా సాధించిన కలెక్షన్లు, ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన చూస్తుంటే, దేశవ్యాప్తంగా అల్లు అర్జున్‌కు ఒక స్పెషల్ ప్లేస్ ఏర్పడిందని చెప్పొచ్చు. ఈ హైప్‌తో బన్నీ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) దర్శకత్వంలో రాబోయే ఈ చిత్రం పై అంచనాలు ప్రస్తుతం హై రేంజ్ లో ఉన్నాయి.
త్రివిక్రమ్‌కు మంచి కథలతో ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్నారు. ఎక్కువగా ఫ్యామిలీ డ్రామా, హ్యూమర్, భావోద్వేగాలను మిక్స్ చేయడం త్రివిక్రమ్ స్టైల్. ఇక ఈసారి పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా నెవ్వర్ బిఫోర్ అనేలా కథను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ‘పుష్ప 2’తో నార్త్ ఇండియాలో కూడా బన్నీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది కాబట్టి, ఈ సినిమా నార్త్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించాల్సి ఉంటుంది.
ఈ చిత్రం యాక్షన్ డ్రామాగా ఉంటుందని, కానీ త్రివిక్రమ్ బ్రాండ్ హ్యూమర్ కూడా ఇందులో భాగం కానుందని టాక్. ప్రొడ్యూసర్ నాగ వంశీ ఇటీవలే ఈ సినిమా గురించి హింట్స్ ఇస్తూ, ఇది ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై రాని ఒక నూతన కథతో రూపొందుతోందని తెలిపారు. స్కేల్ పరంగా ఈ ప్రాజెక్ట్ రాజమౌళి స్థాయిలో కాదు అంతకుమించి ఉంటుందంటూ తెలిపారు. అలాగే యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్స్ విషయంలో హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తయిందని టాక్.
2024 మార్చిలో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభమై 2025 చివరికి విడుదల అవుతుందని భావిస్తున్నారు. మ్యూజిక్ కోసం తమన్ లేదా దేవి శ్రీ ప్రసాద్‌ను (Devi Sri Prasad) తీసుకునే అవకాశాలు ఉన్నాయి, కానీ ఇంకా అధికారికంగా ఫైనల్ కాలేదు. అల్లు అర్జున్ తన కెరీర్‌లో ప్రతి కొత్త ప్రాజెక్ట్‌ను ఒక అడుగు ముందుకేసేలా డిజైన్ చేసుకుంటున్నాడు. త్రివిక్రమ్‌తో ఆయన మునుపటి హిట్ చిత్రాలు ‘జులాయి'(Julayi) ,’ ‘సన్నాఫ్ సత్యమూర్తి (S/O Satyamurthy) , అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramulo)’ పెద్ద విజయాలు సాధించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ కూడా హిట్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.