దువ్వాడ జగన్నాథం సినిమా అనుకున్నంతగా విజయం సాధించకపోవడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూట్ మార్చారు. కొత్త దర్శకులైతే కష్టపడి పనిచేస్తారని.. వారితో సినిమా చేయడానికి ఆసక్తి కనబరిచారు. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ “నా పేరు సూర్య” సినిమా చేసారు. ఘోర అపజయాన్ని చూసారు. దీంతో పాత రూట్ లోకే వచ్చారు. స్టార్ డైరక్టర్స్ తో సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యారు. అయితే ప్రస్తుతం స్టార్ డైరక్టర్స్ అందరూ బిజీగా ఉన్నారు. రాజమౌళి మల్టీస్టారర్ సినిమాతోనూ, త్రివిక్రమ్ ఎన్టీఆర్ తోను, కొరటాల చిరుకు కథ రెడీ చేయడంలో, సుకుమార్ మహేష్ బాబుకి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. సో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించాలని అనుకున్నారు.
అతను చెప్పిన కథ బాగున్నా.. సాలిడ్ హిట్ మాత్రం దొరికేలా లేదు. అందుకే కొంచెం లేట్ అయినా హిట్ కథతోనే రావాలని చూస్తున్నారు. తనకి జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి విజయాలను అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించాలని ఆశ పడుతున్నారు. అతను “అరవింద సమేత వీర రాఘవ” సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పనులు పూర్తి కావడానికి ఇంకో రెండు నెలలు సమయం పడుతుంది. అక్టోబర్ 10 తరువాత త్రివిక్రమ్ రిలాక్స్ అవుతారు. అప్పుడు తన ప్రాజక్ట్ పై దృష్టి పెట్టేలా ఆలోచన చేస్తున్నారు. అందుకు తగ్గట్టు అల్లు అర్జున్ తన తండ్రితో కలిసి సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే నిర్మించనున్నసంగతి తెలిసిందే. మరి త్రివిక్రమ్ మనసులో ఏ హీరో ఉన్నాడో చూడాలి.