Allu Arjun: బన్నీ ఎంట్రీతో ఆ వివాదాలకు పూర్తిస్థాయిలో చెక్ పడుతుందా?

స్టార్ హీరో బాలయ్య (Nandamuri Balakrishna) అన్ స్టాపబుల్ షోను తన హోస్టింగ్ తో ఏ స్థాయిలో సక్సెస్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ షో మూడు సీజన్లను పూర్తి చేసుకోగా తొలి రెండు సీజన్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అన్ స్టాపబుల్3 లిమిటెడ్ ఎడిషన్ పేరుతో తక్కువ ఎపిసోడ్లు మాత్రమే ప్రసారమైంది. అన్ స్టాపబుల్ సీజన్4 ను మాత్రం ఒకింత భారీ స్థాయిలో ప్లాన్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

Allu Arjun

అయితే అన్ స్టాపబుల్ సీజన్4 ఫస్ట్ ఎపిసోడ్ కు బన్నీ  (Allu Arjun) గెస్ట్ గా హాజరు కానున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్ గతంలో ఈ షోకు హాజరు కావడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని వివాదాల ద్వారా బన్నీ పేరు మారుమ్రోగుతోంది. ఆ వివాదాలు బన్నీ కెరీర్ కు సైతం ఒకింత మైనస్ అయ్యాయి. అయితే అన్ స్టాపబుల్ షోలో బన్నీ ఆ వివాదాల గురించి స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.

వైరల్ అవుతున్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే మాత్రం ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వరకు ఆగాల్సిందే. అన్ స్టాపబుల్ షో సీజన్4 ఆహా ఓటీటీకి ఎంతమేర ప్లస్ అవుతుందో చూడాల్సి ఉంది. అల్లు అర్జున్ పుష్ప2 సినిమాకు ఒకింత భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు బన్నీ భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ అందుకున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

పుష్ప2 (Pushpa 2) రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు ఉండబోదని ఈ మూవీ ప్రీమియర్లు డిసెంబర్ నెల 5వ తేదీనే ప్రదర్శించబడే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. అన్ స్టాపబుల్ సీజన్4 కు సంబంధించి అతి త్వరలో అదిరిపోయే అప్ డేట్స్ రానున్నాయని సమాచారం. ఈ షో ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.

మెగా ఫ్యాన్స్ టెన్షన్.. టీజర్లో తేడా వస్తే..?!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus