చిరు – బన్నీ కంపారిజన్‌ గురించి అల్లు బాబి ఏమన్నారంటే?

మెగాస్టార్‌ చిరంజీవి – మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ మధ్య పోటీ పెడితే… తండ్రీకొడుకులు కదా అనుకోవచ్చు. చిరంజీవి – అల్లు అర్జున్‌ మామ, మేనల్లుడు మధ్య పోటీ పెడితే మామాఅల్లుళ్ల పోటీ అనుకోవచ్చు. అయితే ఇది ఇక్కడివరకే బాగుంటుంది. అంతేకానీ మామను మించిన అల్లుడు అయిపోవాలనే ఆలోచన ఆ మనిషిలో లేకపోయినా… కావాలనే ఆపాదిస్తే చూడటానికి అస్సలు బాగోదు కదా. అయితే అది కరెక్ట్‌ కూడా కాదు. అల్లు అరవింద్‌ నిర్మాణ రంగ వారసుడు అల్లు బాబీ ఇదే మాట అంటున్నారు.

Click Here To Watch NOW

అల్లు బాబి నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘గని’. ఏప్రిల్‌ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో బాబి ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో చిరంజీవి – అల్లు అర్జున్‌ మధ్య పోటీ వాతావరణం గురించి, ఇద్దరి మధ్య పోలికలు పెడుతున్న విషయం గురించి మాట్లాడారు. నేను ఎప్పటికీ చిరంజీవిని, అల్లు అర్జున్‌ని పోల్చి చూడను. అలా పోల్చి చూడటం సరైన పద్ధతి కాదన్నారు బాబి. చిరంజీవి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా పరిశ్రమలోకి వచ్చి.. ఎన్నో కష్టాలు దాటి మెగాస్టార్‌ అయ్యారు.

ఈ క్రమంలో చిరు ఈ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. అల్లు అర్జున్‌ అలా కాదు, మా నాన్న, తాతయ్య అతని వెనుక ఉన్నారు. మా కుటుంబంలో ఎంతోమందికి చిరంజీవి స్ఫూర్తి. బన్నీ ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పాడు కూడా. అయినా మనలో స్ఫూర్తినింపిన వ్యక్తితో మనల్ని మనం ఎప్పటికీ పోల్చుకోకూడదు అని చెప్పారు అల్లు బాబి. దాంతోపాటు ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా గురించి కూడా బాబి మాట్లాడారు.

‘నా పేరు సూర్య’ తర్వాత బన్నీ ఎంతో పరిణతి చెందాడు. ఆ సినిమాపై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. దాంతో రెండేళ్లకుపైగా గ్యాప్‌ తీసుకున్నాడు. ప్రేక్షకులు తన నుండి ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారు అనేది తెలుసుకున్నాడు. అలా తనను తాను మలచుకుని ‘అల.. వైకుంఠపురములో..’ సినిమా చేశాడు. ఆ సినిమా ఇచ్చిన విజయంతో ‘పుష్ప’ చేసి అదరగొట్టాడు అని చెప్పుకొచ్చారు బాబి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus