స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ఖాతాలో ఈ మధ్య కాలంలో అరుదైన రికార్డ్స్ చేరుతుండగా ఆ రికార్డ్స్ ఫ్యాన్స్ కు సైతం ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్న సంగతి తెలిసిందే. దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో బన్నీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. బన్నీ సాధించిన అరుదైన ఘనత విషయంలో బన్నీ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. బన్నీ సాధించిన ఈ ఘనత గురించి అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు.
తన ట్విట్టర్ పోస్ట్ లో అల్లు శిరీష్ (Allu Sirish) 15 సంవత్సరాల క్రితం మేడమ్ టుస్సాడ్స్ సందర్శించడానికి పర్యాటకులుగా వెళ్లామని అక్కడ ఫోటోలు తీసుకున్నామని తెలిపారు. ఒకరోజు మా ఫ్యామిలీకి చెందిన వ్యక్తి విగ్రహంతో మేడమ్ టుస్సాడ్స్ లో ఫోటోలు క్లిక్ చేస్తానని ఎప్పుడూ ఊహించలేదని ఆయన చెప్పుకొచ్చారు. వాటే జర్నీ అంటూ అల్లు అర్జున్ సక్సెస్ స్టోరీ గురించి అల్లు శిరీష్ కామెంట్లు చేయడం గమనార్హం.
15 సంవత్సరాల క్రితం మేడమ్ టుస్సాడ్స్ లో దిగిన ఫోటోలను సైతం అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరిగింది. అల్లు శిరీష్ చేసిన ఈ పోస్ట్ కు దాదాపుగా 9000కు పైగా లైక్స్ వచ్చాయి. బన్నీ సక్సెస్ స్టోరీ అదుర్స్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఆగష్టు నెల 15వ తేదీన పుష్ప ది రూల్ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. బన్నీ పుట్టినరోజున ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది.
పుష్ప ది రూల్ (Pushpa2) టీజర్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాల్సి ఉంది. పుష్ప ది రైజ్ ను ఎన్నో రెట్లు మించి ఈ సినిమా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పుష్ప ది రూల్ రిలీజ్ డేట్ కు సంబంధించి వేర్వేరు వార్తలు వినిపిస్తున్నా ఈ సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పులు ఉండవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ సినిమా బడ్జెట్ పరంగా కూడా టాప్ లో ఉంది. ఈ సినిమా మైత్రీ బ్యానర్ క్రేజ్ ను పెంచుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.