బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నభా నటేష్, అనూ ఇమ్మాన్యుయల్ లు హీరోయిన్లుగా సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘అల్లుడు అదుర్స్’. సోనూ సూద్, ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ ను మూటకట్టుకుంది. ‘సినిమా మొత్తం ‘కందిరీగ’ కు సీక్వెల్ గా ఉంది’ అనే కామెంట్లు కూడా వినపడ్డాయి. అయితే కొంతమంది ఊరమాస్ ప్రేక్షకులు ఈ చిత్రానికి మంచి టాకే చెప్పారు. దాంతో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయని చెప్పొచ్చు.
ఇక ఈ చిత్రం 4 రోజుల కలెక్షన్లను ఓసారి గమనిస్తే :
నైజాం | 1.94 cr |
సీడెడ్ | 1.25 cr |
ఉత్తరాంధ్ర | 1.16 cr |
ఈస్ట్ | 0.38 cr |
వెస్ట్ | 0.40 cr |
కృష్ణా | 0.22 cr |
గుంటూరు | 0.41 cr |
నెల్లూరు | 0.18 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 5.94 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.11 cr |
ఓవర్సీస్ | 0.05 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 6.10 cr |
‘అల్లుడు అదుర్స్’ చిత్రానికి 13కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇందులో చాలా వరకూ నిర్మాత ఓన్ రిలీజ్ చేసుకున్నాడు కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 10కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.విడుదలైన 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 6.10కోట్ల షేర్ ను రాబట్టింది.సంక్రాంతి పండుగ కావడంతో.. అల్లుడు బాగానే క్యాష్ చేసుకున్నాడు. అయితే ఈరోజు నుండీ ఈ చిత్రానికి అసలు పరీక్ష మొదలుకాబోతుంది. ‘మరి బ్యాలన్స్ 3.90 కోట్ల షేర్ ను ఈ వీక్ డేస్ లో అల్లుడు రాబట్టి అదుర్స్ అనిపించుకోగలడా?’ అనేది చూడాల్సి ఉంది.
Click Here To Read Movie Review
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!