శ్రీవిష్ణు హీరోగా రూపొందిన గత చిత్రాలు ‘అర్జున ఫల్గుణ’ ‘భళా తందనాన’ వంటి చిత్రాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని ‘అల్లూరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో. ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘లక్కీ మీడియా’ బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించగా… బెక్కెం బబిత సమర్పకులుగా వ్యవహరించారు.
సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది.కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం
0.38 cr
సీడెడ్
0.21 cr
ఉత్తరాంధ్ర
0.23 cr
ఈస్ట్
0.11 cr
వెస్ట్
0.07 cr
గుంటూరు
0.14 cr
కృష్ణా
0.17 cr
నెల్లూరు
0.08 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
1.39 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్
0.26 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
1.65 cr
‘అల్లూరి’ చిత్రానికి రూ.3.42 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.3.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.1.65 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బయ్యర్స్ కు ఈ చిత్రం రూ.2.05 కోట్ల నష్టాలను మిగిల్చింది. వేరే టైంలో రిలీజ్ అయ్యి ఉంటే ఈ మూవీ సక్సెస్ అయ్యి ఉండేదేమో. ఇప్పుడైతే అతని కెరీర్లో మరో ఫెయిల్యూర్ మూవీగా మిగిలిపోయింది.