అల్లు అర్జున్ (Allu Arjun) వైసీపీ శిల్పారవికి మద్దతు తెలపడంతో ఆ తరువాత జనసేన టీడీపీ నేతలు సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఇక వైసీపీ నేతలు ఫ్యాన్స్ అందరూ కూడా అల్లు అర్జున్ కు సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు. ఈ వివాదం హై రేంజ్ నేతల వరకు వెళ్లినట్లు అర్ధమవుతుంది. పుష్ప 2పై (Pushpa 2) వస్తున్న వివాదాలు, విమర్శలపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించడం విశేషం. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో పుష్ప 2పై జరుగుతున్న దుష్ప్రచారం గురించి ప్రశ్నించగా, ఆయన మాట్లాడుతూ, “ఎవరైనా సినిమా మీద దుష్ప్రచారం చేస్తే అది పనిచేయదు.
Allu Arjun
సినిమా బాగుంటే ఎవరూ ఆపలేరు. పుష్ప 2ను చూడకుండా ఎవరూ ఉండలేరు,” అని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ సక్సెస్ చూసి కొందరికి అసూయ కలుగుతుందని, కానీ ఇది ఫలితం ఇచ్చే వ్యక్తి శ్రమ, అరచేతిని పెట్టి సూర్యకాంతిని ఆపలేనట్టే, బాగున్న సినిమాని ఆపడం ఎవరికీ సాధ్యం కాదని అన్నారు. పుష్ప 1 (Pushpa) హాలీవుడ్ స్థాయి స్టాండర్డ్స్ లో ఉంది. పుష్ప 2 కూడా అంతకుమించి ఉంటుందని నమ్మకం, అంటూ అంబటి పేర్కొన్నారు.
వివాదాలపై తన అభిప్రాయం తెలుపుతూ, “జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) దేవర (Devara) సినిమాలు బహిష్కరించాలని గతంలో ప్రయత్నించారు. కానీ ప్రేక్షకుల ప్రేమ ముందు ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు. ప్రజల ఆదరణ ఉన్నంత వరకు ఇలాంటి బహిష్కరణల వల్ల ఎవరికీ నష్టం ఉండదు,” అని వ్యాఖ్యానించారు. అంబటి రాంబాబు మాటలు ఇప్పుడు అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారాయి.
పుష్ప 2పై వచ్చిన ప్రతికూల ప్రచారాలను పక్కన పెట్టి ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఆయన చేసిన పాజిటివ్ కామెంట్స్ అల్లు అర్జున్ అభిమానులను ఎంతవరకు అట్రాక్ట్ చేస్తాయో చూడాలి. ఇక పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద తప్పకుండా సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు రాబడుతుందని అంటున్నారు.