Amitabh Bachchan: అమితాబ్ సినిమాకి పెద్ద షాక్!

బాలీవుడ్ సినిమాల భవిష్యత్తు పట్ల ఆందోళన రోజురోజుకి ఎక్కువవుతోంది. కరోనా దెబ్బకి అసలు ఏడాదిగా బాలీవుడ్ లో అసలు రెవెన్యూ అనేదే లేకుండా పోయింది. సెకండ్ వేవ్ తరువాత పరిస్థితులు మారతాయేమో అనుకున్నారు. కానీ అలా జరగడం లేదు. ఈ మధ్యనే అక్షయ్ కుమార్ నటించిన ‘బెల్ బాటమ్’ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవం ఎదురైంది. అక్షయ్ సినిమాలకు తొలిరోజు వచ్చే వసూళ్లు కూడా ఈ సినిమాకి ఫుల్ రన్ లో రాలేదు.

‘బెల్ బాటమ్’ రిజల్ట్ ను బట్టి మరిన్ని సినిమాలు రిలీజ్ అవ్వాలనుకున్నాయి. కానీ ఈ సినిమాకి నెగెటివ్ రెస్పాన్స్ రావడంతో చాలా మంది నిర్మాతలు వెనక్కి తగ్గారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యం చేసి ‘చెహ్రే’ అనే సినిమాను విడుదల చేశారు. అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలు పోషించిన థ్రిల్లర్ సినిమా ఇది. కామెడీ చిత్రాలను డైరెక్ట్ చేసే రుమీ జాఫ్రి ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

మంచి రేటింగ్స్ వచ్చాయి. స్క్రిప్ట్ గురించి.. ఆర్టిస్ట్ ల పెర్ఫార్మన్స్ గురించి అందరూ పొగుడుతున్నారు. అయితే ఇంత పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం ఆ రేంజ్ లో లేవు. కేవలం రూ.50 లక్షల కలెక్షన్స్ వచ్చాయంటే.. సినిమా పరిస్థితి ఏంటో అంచనా వేయొచ్చు. వీకెండ్ లో కూడా కలెక్షన్స్ పుంజుకోలేదు. దీన్ని బట్టి ప్రేక్షకులు ఇప్పట్లో థియేటర్లకు రారేమో అనిపిస్తుంది. అలా అయితే సినిమాలేవీ ఇప్పట్లో రిలీజ్ కు నోచుకోలేవు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus