కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయం సాధించగా ఈ వీకెండ్ లో కూడా ఈ సినిమాకు బుకింగ్స్ భారీ స్థాయిలో జరిగే అవకాశం అయితే ఉంది. కల్కి 2898 ఏడీ ఫుల్ రన్ కలెక్షన్లు 1200 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. అమితాబ్ (Amitabh Bachchan) తాజాగా కల్కి గురించి మరోసారి మాట్లాడుతూ ప్రేక్షకుల కోసమే కల్కి సినిమాలో కొన్ని సీన్స్ తెరకెక్కించారని చెప్పారు.
ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ నిడివి ఎక్కువగా ఉందని డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్తే బాగుంటుందని కొందరికి అనిపించి ఉండొచ్చని అమితాబ్ పేర్కొన్నారు. ఆ సీన్ ను కేవలం ఇంట్రడక్షన్ సీన్ లా కాకుండా తెలుగు హీరో పరిచయ సన్నివేశంలా చూడాలని అమితాబ్ పేర్కొన్నారు. కోట్ల సంఖ్యలో ఫ్యాన్స్ ప్రభాస్ ను దేవుడిలా చూస్తారని ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని అమితాబ్ పేర్కొన్నారు.
ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ్ అశ్విన్ (Nag Ashwin) అభిమానుల కోసమే కల్కి 2898 ఏడీ సినిమాలో డైలాగ్ ఉందని నాకు ఫ్యాన్స్ ఉన్నారని భైరవ అంటే తెలుసు రెబల్ ఫ్యాన్స్ అని బుజ్జి అంటుందని వెల్లడించారు. ఈ సీన్ చూసి ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేసి ఉంటారని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. కల్కి 2898 ఏడీ ప్రభాస్ కెరీర్ లో బాహుబలి (Baahubali) సిరీస్ తర్వాత ఆ రేంజ్ హిట్ గా నిలిచింది.
కల్కి 2898 ఏడీ ఓటీటీలో ఆలస్యంగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నా ఓటీటీలో సైతం ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కల్కి 2898 ఏడీ సీక్వెల్ ఎప్పటినుంచి మొదలవుతుందనే చర్చ ప్రేక్షకుల్లో జరుగుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి సీక్వెల్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని భావిస్తుండటం గమనార్హం.