వెంకటేష్ (Venkatesh Daggubati) 49వ సినిమాగా ‘నువ్వు నాకు నచ్చావ్’ (Nuvvu Naaku Nachav) వచ్చింది. అది ఎవ్వరూ ఊహించని విధంగా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పటికీ ఆ సినిమాని యూట్యూబ్లో, టీవీల్లో తెగ చూస్తూ ఉంటారు జనాలు. కె.విజయ్ భాస్కర్ (K. Vijaya Bhaskar) డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి త్రివిక్రమ్ (Trivikram) కథ స్క్రీన్ ప్లే అందించారు..! సినిమాకి మొత్తం హైలెట్.. త్రివిక్రమ్ రైటింగ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ‘నువ్వు నాకు నచ్చావ్’ సూపర్ హిట్ అయ్యాక త్రివిక్రమ్ కు ఓ కారు బహుమతిగా ఇచ్చి సత్కరించారు డా.డి.రామానాయుడు (D. Ramanaidu), సురేష్ బాబు (D. Suresh Babu).
అంతేకాదు వెంకటేష్ 50వ సినిమా అయిన ‘వాసు’ (Vasu) కి కూడా త్రివిక్రమ్ ను తీసుకున్నారు. ‘వాసు’ సినిమా కథ, స్క్రీన్ ప్లే కరుణాకరన్ (A. Karunakaran) డిజైన్ చేసుకున్నప్పటికీ.. డైలాగ్స్ త్రివిక్రమ్ అందించడం జరిగింది. ఇది క్రేజీ కాంబో కాబట్టి.. ‘వాసు’ కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. వెంకటేష్ మైల్ స్టోన్ మూవీ స్పెషల్ గా నిలుస్తుంది అని అంతా అనుకున్నారు.
కానీ అందరి అంచనాలను తలకిందులు చేసింది ‘వాసు’ చిత్రం. 2002 ఏప్రిల్ 10న ‘వాసు’ రిలీజ్ అయ్యింది. ‘క్రియేటివ్ కమర్షియల్స్’ బ్యానర్ పై కె.ఎస్.రామారావు (K. S. Rama Rao) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా అనిపిస్తాయి. హారిస్ జయరాజ్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి.
కానీ కథ, కథనం ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు. ‘వాయిస్ ఆఫ్ యూత్’ అనే క్యాప్షన్ వెంకటేష్ ఏజ్ కి, ఇమేజ్ కి సెట్ అవ్వలేదు. అప్పటికే వెంకీ 40లకి ఎంట్రీ ఇచ్చాడు. వెంకటేష్ ను అలాంటి లుక్లో కూడా ఆడియన్స్ చూడలేకపోయారు. కానీ ఇప్పటికీ సినిమా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే యూత్ కి ఇన్స్పిరేషన్ గా అనిపిస్తాయి.