Sharwanand: శర్వానంద్ ‘మహాసముద్రం’ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

గత 3 ఏళ్ళుగా హిట్టు లేక హీరో శర్వానంద్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. 2017 చివర్లో వచ్చిన ‘మహానుభావుడు’ చిత్రాన్ని పక్కన పెడితే.. ఆ తర్వాత వచ్చిన ‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ‘జాను’ ‘శ్రీకారం’ వంటి చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. మంచి టాక్ ను సంపాదించుకున్నప్పటికీ ‘జాను’ ‘శ్రీకారం’ చిత్రాలు డిజాస్టర్లు కావడంతో శర్వానంద్ చాలా డిజప్పాయింట్ అయ్యాడు. దీంతో తన తదుపరి సినిమా అయిన ‘మహాసముద్రం’ తో ఎలాగైనా సరే హిట్టు కొట్టాలని దాని పైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు.

‘ఆర్.ఎక్స్.100’ హీరో అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంతో పాటు కిశోర్ తిరుమల డైరెక్షన్లో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ వంటి విభిన్నమైన చిత్రంలో కూడా నటిస్తున్నాడు శర్వానంద్. అయితే వీటిలో కచ్చితంగా ‘మహాసముద్రం’ సినిమా ఆకట్టుకునే విధంగా ఉంటుందనేది ఇన్సైడ్ టాక్.అంతేకాదు ‘ ‘గమ్యం’ ‘ప్రస్థానం’ చిత్రాలు సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఏ విధంగా అయితే శర్వానంద్ కు మంచి పేరు తెచ్చి పెట్టాయో..

అదే విధంగా ‘మహాసముద్రం’ సినిమా కూడా శర్వానంద్ కు మంచి పేరు తెచ్చి పెడుతుంది’ అని అతని సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ చిత్రంలో శర్వానంద్ తో పాటు హీరో సిద్దార్థ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ మాస్ ఆడియెన్స్ కు గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉండబోతున్నాయి అని ఇన్సైడ్ టాక్.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus