Prabhas: ‘ప్రాజెక్ట్ K’ సినిమాకి ఆనంద్ మహీంద్రా ఫుల్ సపోర్ట్!

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గురించి అందరికీ తెలిసిందే. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారాయన. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు ఆనంద్ మహీంద్రా. తన కార్లను, కంపెనీను ఎలా ప్రమోట్ చేసుకోవాలో ఆయనకు బాగా తెలుసు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వాడుతుంటారు. ఇదిలా ఉండగా.. ఇటీవల దర్శకుడు నాగ్ అశ్విన్ తన సినిమా కోసం ఆనంద్ మహీంద్రా సాయం కోరిన సంగతి తెలిసిందే.

Click Here To Watch Now

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ K’ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చాలా కార్లు కనిపించబోతున్నాయి. దీనికోసం ఓ తెలివైన ఇంజనీర్, కార్లను ఉత్పత్తి చేయడంలో దిట్ట అయిన ఓ వ్యక్తి కావాలని.. ఆనంద్ మహీంద్రాను సహాయం అడిగారు నాగ్ అశ్విన్. దానికి వెంటనే ఆయన బదులిచ్చారు. వీరిద్దరి మధ్య ట్వీట్ల సంభాషణ జరిగింది. ఆనంద్ మహీంద్రా తన టీమ్ లోని హెడ్ ని కూడా పరిచయం చేశారు.

మొత్తానికి ప్రాజెక్ట్ K సినిమాకి సంబంధించిన పనుల్లో ఆనంద్ మహీంద్రా టీమ్ కూడా జాయిన్ అయినట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. నాగ్ అశ్విన్ ఓ ట్వీట్ వేశారు. ఆనంద్ మహీంద్రా రీసెర్చ్ వ్యాలీను సందర్శించారు నాగ్ అశ్విన్. అక్కడి వాతావరణాన్ని చూసి ఫిదా అయిపోయారు. దీంతో వెంటనే సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ పెట్టారు. ‘ క్యాంపస్ అద్భుతంగా ఉంది. ప్రకృతితో మమేకమైనట్టుంది. వేలు మహేంద్ర, అతని బృందంతో కలిసి ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది..

ఆనంద్ మహీంద్రా సర్‌కు థ్యాంక్స్’ అని ట్వీట్ పెట్టగా.. వెంటనే ఆయన.. ‘నిజం చెప్పాలంటే.. నువ్వే ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పి, ఈ సైంటిఫిక్ మూవీ పట్ల ఎంతో ఆత్రుతను పెంచావ్. నాగ్ అశ్విన్.. నువ్ హాలీవుడ్‌ను బీట్ చేయబోతోన్నావని నాకు అనిపిస్తుంది’ అంటూ ఆనంద్ మహీంద్రా పోస్ట్ పెట్టారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus