అనసూయ కెరీర్ కి మైల్ స్టోన్ లాంటి రోల్.!
- March 31, 2018 / 11:27 AM ISTByFilmy Focus
నిన్నమొన్నటివరకూ “జబర్దస్త్” మరియు ఆ తరహా రియాలిటీ షోలలో వెకిలి నవ్వులు నవ్వుతూ.. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని దర్శనమిచ్చే అనసూయను చూస్తే ఎవరూ ఆమెలో మంచి నటి ఉందని కనీసం ఎవరూ ఊహించను కూడా లేరు. కానీ.. మొట్టమొదటిసారిగా “రంగస్థలం” సినిమాలో అనసూయను చూసినవాళ్ళందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా సినిమాలో అత్యంత సహజంగా రంగమ్మత్త పాత్రను పోషించిన అనసూయను చూసి
ఈమె ఇంత అద్భుతంగా నటించగలదా అని అవాక్కవుతున్నవారి సంఖ్య ప్రతి షోకి పెరిగిపోతోంది.
ఈ సినిమాలో సహజంగా నటించడం కంటే ఎక్కువగా మనం గోదావరి ప్రాంతాల్లో చూసే సగటు అత్తమ్మ (ఆంటీ) లాగే అనసూయ వేష భాషలుండడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే.. అనసూయ అందాలని ఏ ఒక్క సన్నివేశంలోనూ శృంగారాత్మకంగా కాక భావాత్మకంగా సుకుమార్ చూపిన తీరుకి అందరూ ఫిదా అవుతున్నారు. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో కనీరు పెట్టించిన అనసూయ తన ఇమేజ్ కు తానే మంచి మేకోవర్ ఇచ్చుకొంది. ఇకనైనా మన దర్శకనిర్మాతలు అనసూయను ఒక గ్లామర్ గర్ల్ గా కాకుండా మంచి నటిగా గుర్తించాలని ఆశిస్తున్నాం.

















