అనసూయ(Anasuya Bharadwaj)..బికినీ ఫోటోలు షేర్ చేసింది. వాస్తవానికి ఆమె సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేయడం అనేది కొత్త విషయం కాదు. కానీ ఈసారి వాటికి కొంచెం మసాలా కూడా యాడ్ చేసింది. విషయంలోకి వెళితే.. ఇటీవల సీనియర్ నటుడు శివాజీ హీరోయిన్లని నిండుగా చీరలు కట్టుకుని ఫంక్షన్లకి, ఈవెంట్లకి వెళ్ళండి అంటూ హితవు పలికాడు. ఓ మాల్ వద్దకి వెళ్ళినప్పుడు నిధి అగర్వాల్ కు ఎదురైన చేదు అనుభవం, అలాగే సమంత ఎదుర్కొన్న సమస్యల దృష్ట్యా శివాజీ అలా స్పందించడం జరిగింది.
దానికి అనసూయ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయింది. శివాజీ కూడా మహిళా కమిషన్ ని కలిసి క్షమాపణలు తెలుపడం వంటివి జరిగాయి. అంతా అయిపోయింది అనుకుంటున్న టైంలో శివాజీని మళ్ళీ కెలికింది అనసూయ.నిన్న అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా తన ఫ్యామిలీతో కలిసి ఔటింగ్ కి వెళ్ళింది. అక్కడ తన భర్తతో కలిసి స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఆమె షేర్ చేసింది.

‘అదే మనిషి.. అదే ఆత్మవిశ్వాసం.. కానీ సంవత్సరం మారింది’ అంటూ మొదలు పెట్టి.. తనకు నచ్చని విషయాల పై గళం విప్పుతూ ఎవ్వరికీ భయపడకుండా ముందుకు సాగుతాను’ అనే అర్ధం వచ్చేలా పరోక్షంగా శివాజీకి చురకలు అంటించింది. ‘నాకు నచ్చినట్టు నేను ఉంటాను’ అనే లైన్ ని కూడా మధ్యలో జత చేసింది. దీంతో అనసూయ- శివాజీ..ల వివాదం మళ్ళీ తెరపైకి వచ్చినట్టు అయ్యింది.అనసూయ గ్లామర్ ఫోటోలు చూసి కూడా నెటిజన్లు ఆ ఇష్యూ గురించి మాట్లాడుకోవడం గమనార్హం.
