Anasuya: ‘రా రా రక్కమ్మ’ అంటూ హోటల్ వెయిటర్స్ తో అనసూయ చిందులు!

‘జబర్దస్త్’ తో బుల్లితెర పై స్టార్ హీరోయిన్ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది అనసూయ భరద్వాజ్. సోషల్ మీడియాలో ఈమె క్రేజ్ మామూలుగా ఉండదు. స్టార్ హీరోయిన్లతో సమానంగా ఈమెకు ఫాలోవర్స్ సంఖ్య ఉంది. నిత్యం తన లేటెస్ట్ ఫొటోలతో ఈమె హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటుంది.ఆ ఫోటోలకు నెటిజన్లు సూపర్, వావ్ అంటూ కామెంట్లు పెడుతూనే ఉంటారు. మరికొందరైతే అనసూయ పై మండిపడుతూ విమర్శలు గుప్పిస్తూ ఉంటారు.

వాటిని చాలా వరకు అనసూయ పట్టించుకోదు. ఒకవేళ ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టే విమర్శలు అయితే ఆమె కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడదు. ఈ మధ్యనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి ఓ నెటిజెన్ ను ఆమె అరెస్ట్ చేయించిన సంగతి కూడా తెలిసిందే. ఇక మరోపక్క అనసూయకు వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఇందుకోసం ఆమె ‘జబర్దస్త్’ ను కూడా పక్కన పెట్టింది. సినిమాల్లో సహాయనటి పాత్రలు, కీలక పాత్రలు చేస్తూ బిజీగా గడుపుతోంది.

ఇదిలా ఉండగా..అనసూయ ఇటీవల ట్రావెలింగ్ చేస్తూ మధ్యలో రిలాక్స్ అవ్వడం కోసం చిట్యాలలో ఉన్న ఓ ప్లాజా వద్ద ఆగింది.ఇలా ఆమె హోటల్ కు వెళ్లిందో లేదో వెయిటర్స్ అంతా ఈమెను చూసి ఎక్సైట్ అయ్యారు.ఆమెను ఎంటర్టైన్ చేయడానికి డాన్స్ చేశారు. తర్వాత అనసూయ కూడా వీళ్ళతో కలిసి డాన్స్ చేసింది.

‘విక్రాంత్ రోణ’ సినిమాలోని చార్ట్ బస్టర్ సాంగ్ అయిన ‘రారా రక్కమ్మ’ అనే పాటకు అనసూయ వెయిటర్స్ తో కలిసి ఈ డాన్స్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus