Anasuya in Pushpa: ‘పుష్ప’ లో అనసూయ రోల్ అలా ఉండబోతుందట..!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న మూడవ చిత్రం ‘పుష్ప’. ‘రంగస్థలం’ లానే ఈ చిత్రానికి కూడా క్యాస్టింగ్ కు పెద్ద పీట వేసాడు సుకుమార్. అల్లు అర్జున్, రష్మిక,ఫహాద్ ఫాజిల్ తో పాటు కన్నడ నటుడు ధనుంజయ్, సునీల్, అనసూయ, అజయ్ ఘోష్‌, అజయ్, రావు రమేష్ ఇలా చాలా మంది నటీనటులు ట్రైలర్లో కనిపించారు.అయితే అందరికంటే ఎక్కువగా అనసూయ లుక్ బాగా వైరల్ అవుతుంది. నోట్లో బ్లేడు పెట్టుకుని మంగళం శ్రీను పాత్రని పోషిస్తున్న సునీల్ ను ఆమె బెదిరిస్తున్న విజువల్ ట్రైలర్లో ఉంది.

దాంతో అసలు ఈ సినిమాలో అనసూయ పాత్ర ఎలా ఉండబోతుందా? అనే ఆసక్తి సర్వత్రా నడుస్తుంది. అయితే కొన్ని కథనాల ప్రకారం అనసూయ… దాక్షాయణి అనే నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో చాలా భయంకరంగా కనిపిస్తుందట. అమ్మోరు స్టైల్లో పెద్ద బొట్టుతో, చేతికి ఉంగరాలు, మెడలో నగలు వేసుకుని నోట్లో కిళ్ళీ గట్టిగా అరుస్తూ పెత్తనం చలాయించే ఓ పెద్దింటి మహిళగా అనసూయ కనిపించబోతుందట.కొంచెం ఈ పాత్ర ‘నిజం’ సినిమాలో రాశి పాత్రని పోలి ఉంటుందని కూడా తెలుస్తుంది.

అయితే ఆమె పాత్రకి సంబంధించి ఓ ట్విస్ట్ కూడా ఉండబోతుందట. ఆ సీన్ కు థియేటర్లలో విజిల్స్ పడడం ఖాయమట.ఇప్పటివరకు గ్లామర్ గా కనిపించిన అనసూయ.. ఇలాంటి క్రూరమైన పాత్రలో ఎలా నటించబోతుంది అనేది తెలియాలంటే డిసెంబర్ 17 ‘పుష్ప ది రైజ్’ విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే..!

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus