జబర్దస్త్ నుండీ బయటకు వచ్చేయాలని 2 ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నాను..ఓపెన్ అయిపోయిన అనసూయ!

జబర్దస్త్ కామెడీ షో 9 ఏళ్ళుగా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ షోలో కామెడీ స్కిట్స్ ఎంత ఫేమసో.. అనసూయ గ్లామర్ కూడా అంతే ఫేమస్. అయితే ఇటీవల ఆమె షో నుండీ బయటకి వచ్చేసింది. అనసూయ పాపులర్ అయ్యిందే జబర్దస్త్ వల్ల.., ఆమె సినిమాల్లో బిజీగా రాణిస్తుంది అంటేనే జబర్దస్త్ వల్ల. అయితే జబర్దస్త్ నుండీ అనసూయ బయటకు రావడం వెనుక పెద్ద కథే ఉంది. అది లేటెస్ట్ ఇంటర్వ్యూలో అనసూయ బయటపెట్టింది.

అనసూయ మాట్లాడుతూ……”జబర్దస్త్ నుండీ బయటకు రావాలనే థర్డ్ ప్రాసెస్ దాదాపు రెండేళ్ల నుండీ జరుగుతూ ఉంది. మల్లెమాల ప్రొడక్షన్స్ హౌస్‌ నాకు మంచి అవకాశాలు ఇచ్చింది.. అక్కడ మంచి మంచి వ్యక్తులు ఉన్నారు. అయితే అనుకోకుండా కొన్ని వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి. నాకెందుకో ఆ టైంలో.. జబర్దస్త్‌లో ఉన్న వాళ్లకి దిష్టి తగిలిందేమో అనిపించింది. అంతా కలిసి ఓ ఫ్యామిలీలా ఉండేవాళ్ళం. జబర్దస్త్‌లో చేసేది.. సినిమాల్లో చేసేది నేను కాదు. నేను కేవలం అక్కడ పనిచేస్తున్నానంతే.! నాకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.. షూటింగ్ కోసం అడ్జెస్ట్‌మెంట్ అడిగినప్పుడు నాకే గిల్టీగా అనిపిస్తుంది. అంతమంది చేస్తున్నారు.. నా కోసం షెడ్యుల్ మార్చడం కరెక్ట్ కాదు అనే ఫీలింగ్ నాకే కలుగుతుంది.తొమ్మిదేళ్లు జబర్దస్త్ కు యాంకర్‌గా చేస్తున్నా.. నాకు ఆ షో బోర్ కొట్టలేదు. నేను ఎవర్నీ బ్లేమ్ చేయదల్చుకోలేదు.

కానీ నాకు నచ్చని సందర్భాలు చాలా ఉన్నాయి కానీ.. క్రియేటివ్ ఫీల్డ్‌లో ఇవన్నీ తప్పవు. ఆ ఊబిలో ఇరుక్కోవాలని నాకు అనిపించలేదు. నాకు ఎందుకు భయం వేసింది.. ఏదైనా పంచ్ వేసినప్పుడు నాకు నచ్చక ఎక్స్ ప్రెషన్స్ & రియాక్షన్ ఇచ్చినా.. అది పీపుల్‌కి చేరేది కాదు. కానీ ప్రేక్షకులకి మాత్రం కనిపించేదే నిజం. రంగుల ప్రపంచంలో నేను అది కాదు అని చెప్పాలనుకున్నా అది ప్రేక్షకులకి చేరదు.బాడీ షేమింగ్.. వెకిలి చేష్టలు వంటివి నాకు నచ్చవు.

వాటిపై నేను రియాక్షన్ ఇచ్చే ఉంటాను కానీ అది వేయరు.నా పై పంచులు వేయడం, డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేయించుకోవడం వంటి వాటి వల్ల చాలా స్ట్రగుల్ అయ్యాను. కొంతమంది నన్ను చాలా మంచిదాన్ని అని అంటుంటారు. ఇంకొంతమంది నాకు పొగరని అనుకుంటారు. అదీ నేనే.. ఇదీ నేనే.. ఆ విషయంలో నేను సిగ్గుపడటం లేదు. నాగబాబు గారు వెళ్లిపోయారు.. రోజా గారు వెళ్లిపోయారు.. ఇంకా చాలామంది వెళ్లిపోయారు కదా.. అని నేను జబర్దస్త్‌‌ని వదిలేశాననడంలో నిజం లేదు. నాగబాబుగారు.. రోజా గారు.. నేను.. మేమంతా మొదటి నుంచి ఉన్నాం.. అప్పటికి సుడిగాలి సుధీర్ వాళ్లు కూడా లేరు.వాళ్లు వెళ్లిపోయారని.. వెళ్లిపోవడానికి నేనేం గొర్రెల మంద టైప్ కాదు.

చాలా రోజుల క్రితం.. ఓ గొర్రెల మంద అయితే నన్ను నిజంగా ఎటాక్ చేయడం జరిగింది. టీఆర్పీ రేటింగ్ ల లెక్కలు నాకు పెద్దగా తెలియవు. నేను స్టార్టింగ్‌లో చేసినప్పుడు హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది అంటారు. నాకిచ్చే జీతానికి నేను ఎంత చేయాలో అంత చేస్తాను. నాకు టీఆర్పీతో సంబంధం లేదు. నేను వాటిని పట్టించుకోను. అయితే ఇప్పటివరకూ నా వల్ల తక్కువ వచ్చిందని.. నేను తప్పు చేశాననే మాటలు అయితే నాకు ఇప్పటి వరకూ వినిపించలేదు” అంటూ అనసూయ చెప్పుకొచ్చింది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Share.