Pawan Kalyan: నిర్మాతగా మారబోతున్న యాంకర్ ప్రదీప్… పవన్ తోనే మొదటి సినిమా?

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో యాంకర్ ప్రదీప్ ఒకరు. ఈయన ప్రస్తుతం బుల్లితెరపై అన్ని చానల్స్ లోను ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉన్నారు. ఇలా గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రదీప్ బుల్లితెరపై కొన్ని కార్యక్రమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈయన జీ తెలుగులో ప్రసారమవుతున్నటువంటి కొంచెం టచ్ లో ఉంటే చెబుతా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

అయితే ఈ కార్యక్రమానికి ప్రదీప్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇలా ఈ కార్యక్రమాల ద్వారా ఈయన ఎంతో మంచి సక్సెస్ సాధించారు. అలాగే ప్రదీప్ వ్యాఖ్యాతగా ఒక్క షో కోసం భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.ప్రదీప్ ఇలా బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈయన ఇదివరకు పలు సినిమాలలో హీరో ఫ్రెండ్ పాత్రలలో నటించి సందడి చేశారు.

అయితే హీరోగా 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్నప్పటికీ ప్రదీప్ మాత్రం ఇప్పటివరకు తన తదుపరి సినిమా గురించి ఏ విధమైనటువంటి ప్రకటన చేయలేదు. అయితే బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొన్న సమయంలో ప్రదీప్ నిర్మాతగా మారబోతున్నానంటూ కామెంట్స్ చేశారు. ఇలా ఒక యాంకర్ సినిమాని నిర్మించాలి అంటే ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది

అయితే అంత డబ్బు తన వద్ద ఉంది అంటే ఒక్క షో కోసం ప్రదీప్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో అర్థం అవుతుంది.అయితే ఈయన సినిమా కనుక నిర్మిస్తే తన మొదటి సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే చేయాలని పలు సందర్భాలలో తెలియజేశారు.ఇలా యాంకర్ ప్రదీప్ పవన్ కళ్యాణ్ కు నిర్మాతగా మారబోతున్నారని విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది. మరి ఏ డైరెక్టర్ దర్శకత్వంలో ప్రదీప్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాని నిర్మించబోతున్నారనే విషయం తెలియాల్సి ఉంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus