Raj Tarun: రాజ్ తరుణ్ ను షాక్ కి గురి చేసిన యాంకర్.!

రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా ‘తిరగబడరాసామి’ చిత్రం రూపొందింది. ‘యజ్ఞం’ (Yagnam) ‘పిల్లా నువ్వులేని జీవితం’ (Pilla Nuvvu Leni Jeevitam) సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఏ.ఎస్.రవికుమార్ చౌదరి (A. S. Ravi Kumar Chowdary) ఈ చిత్రానికి దర్శకుడు. ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) కంటే ముందుగానే ఈ చిత్రాన్ని కంప్లీట్ చేశాడు రాజ్ తరుణ్. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా బడ్జెట్ సమస్యల వల్ల రిలీజ్ డిలే అవుతూ వచ్చింది. రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. అయితే ఈరోజు ట్రైలర్ లాంచ్ ను హైదరాబాద్ లో ఉన్న ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేశారు.

అయితే బడ్జెట్ సమస్యల వల్లో ఏమో కానీ.. గతంలో ఎన్నడూ యాంకరింగ్ చేయని అమ్మాయితో యాంకరింగ్ చేయించే ప్రయత్నం చేశారు మేకర్స్. యాంకరింగ్ సంగతి పక్కన పెడితే తెలుగులో మాట్లాడటానికే చాలా కష్టపడింది ఆ అమ్మాయి. ఈ క్రమంలో రాజ్ తరుణ్ గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ”ఎఫ్ 2 ‘ వంటి సూపర్ హిట్ సినిమాలో అతను నటించి మెప్పించాడు’ అంటూ పలికింది ఈ కొత్త యాంకర్.

దీంతో రాజ్ తరుణ్ మాత్రమే కాదు అక్కడ ఉన్న వారు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత రాజ్ తరుణ్ స్టేజి పైకి వెళ్ళినప్పుడు.. ‘నేను ఎఫ్ 2 (F2 Movie) సినిమాలో నటించనందుకు చాలా బాధగా ఉంది. ఒకవేళ నటించి ఉంటే నాకు ఎక్కువ పారితోషికం వచ్చేది’ అంటూ యాంకర్ పై కౌంటర్లు వేశాడు రాజ్ తరుణ్. మొత్తానికి ఆ కొత్త యాంకర్ ఈ వారానికి సరిపడా ట్రోల్ మెటీరియల్ ను పంచింది అని చెప్పొచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus