Bigg Boss 5 Telugu: కాజల్ చేసిన ఆ పనికి అనీమాస్టర్ కి ఒళ్లు మండిపోయింది..!

బిగ్ బాస్ హౌస్ లో హోటల్ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా అనీమాస్టర్ మేనేజర్ గా వచ్చిన అతిథితులకి సరిగ్గా సదుపాయాలు ఉన్నాయో లేదో చూస్తోంది. అంతేకాదు, టిప్స్ రూపంలో వారి దగ్గర్నుంచీ డబ్బులు కలక్ట్ చేస్తూ గేమ్ ఆడుతోంది. ఇక అతిథులుగా వచ్చిన సన్నీ, సిరి, కాజల్ ముగ్గురూ కూడా సర్వీసులు చేయించుకుంటూ డబ్బులు అడిగితే మాత్రం ఇవ్వడం లేదు. టిప్పులు ఇవ్వకుండా విసిగిస్తున్నారు. దీంతో అనీమాస్టర్ కి చిర్రెత్తుకొచ్చింది, మార్నింగ్ నుంచీ కష్టపడుతుంటే డబ్బులు ఇవ్వకుండా సేవలు చేయించుకుంటున్నారు అంటూ చిర్రుబుర్రులాడింది.

అయితే, అనీమాస్టర్ సంపాదించుకున్న కొద్దిపాటి డబ్బులు కూడా కాజల్ కొట్టేసింది. కానీ, కాజల్ తను తీసినట్లుగా బయటపడలేదు. అంతేకాదు, అనీమాస్టర్ డబ్బులు పోయాయని చెప్పి రవిని అనుమానించారు కొందరు హౌస్ మేట్స్. ఇక లెగ్ మసాజ్ చేస్తూ హోటల్ స్టాఫ్ టిప్స్ కోసం ప్రయత్నించారు. సన్నీకి రవి, సిరికి షణ్ముక్ మసాజ్ చేస్తూ ఉండగా , కాజల్ కి వేడి వేడి నీళ్లు తీస్కుని వచ్చింది అనీమాస్టర్. దీంతో కాజల్ కాళ్లు కాలాయి. తర్వాత వాటిలో కాస్త చన్నీళ్లు కలుపుతూ సారీ చెప్పింది. లెగ్ మసాజ్ చేసిన తర్వాత సరిగ్గా చేయలేదని చెప్తూ కేవలం 200 మాత్రమే టిప్ ఇచ్చింది కాజల్.

దీంతో అనీమాస్టర్ కి ఒళ్లు మండిపోయింది. బండెడు పనులు చేయించుకుని 100 రూపాయలు కూడా టిప్పు ఇవ్వడం లేదంటూ ఫైర్ అయ్యింది. 400 రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పుడు అది సరిగ్గా లేదంటే నేనేమైనా లెగ్ మసాజ్ చేసేదాన్నా అంటూ రెచ్చిపోయింది అనీమాస్టర్. ఈలోగా రవి వచ్చి కావాలనే మీరు వేడినీళ్లు కాజల్ పై పోశారా అని అడిగితే, కావాలని ఎవరైనా చేస్తారా అంటూ మాట్లాడింది అనీ. అసహనానికి లోనైన అనీమాస్టర్ నేను మనిషినా? పశువునా? అని ఇన్ని పనులు చేయాలా అంటూ బిగ్ బాస్ కెమెరాలకి చెప్పుకుంది. మార్నింగ్ నుంచీ కుక్కల్లా పనులు చేయిస్తున్నారు, కానీ డబ్బులు ఇవ్వరు అంటూ ఏడ్చేసింది.

కాజల్ చేసిన పనికి అనీమాస్టర్ ఏడుస్తుంటే పింకీ వచ్చి బయట ఉన్న కాజల్ తో ఈవిషం చెప్పింది. అయినా కూడా కాజల్ టిప్పు ఇవ్వడానికి సముఖంగా లేదు. కేవలం 200 మాత్రమే ఇస్తానంటూ మరోసారి అనీమాస్టర్ కి చెప్పింది. ఇక్కడ డబ్బులు కొట్టేసిన అనుమానాన్ని మాత్రం రవి మోస్తుంటే, కాజల్ కి , పింకీకి కూడా సీక్రెట్ టాస్క్ ఇచ్చారా అని హౌస్ మేట్స్ గెస్ చేయడం స్టార్ట్ చేశారు. అదీ మేటర్.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus