Bigg Boss 5 Telugu: మానస్ కి పవర్ ఎందుకు ఇచ్చిందో తెలుసా?

బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం నామినేషన్స్ లోకి వచ్చిన 10మంది ఇంటి సభ్యులకి బిగ్ బాస్ మరో ఛాన్స్ ఇచ్చాడు. జీవితమే ఒక ఆట అనే టాస్క్ లో భాగంగా వేరేవాళ్ల బ్యాగ్ ని తీస్కుని హౌస్ మేట్స్ సేఫ్ జోన్ లోకి వచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో మొత్తం తొమ్మిది రౌండ్స్ సాగాయి. ఫైనల్ గా అనీమాస్టర్ కి ఇమ్యూనిటీ లభించింది. టాస్క్ లో భాగంగా ఫస్ట్ రౌండ్ లో శ్రీరామ్ చంద్ర కావాలనే కాజల్ బ్యాగ్ ని తీస్కుని సేఫ్ జోన్ లోకి వెళ్లలేదు. అందుకే శ్రీరామ్ కాజల్ ఇద్దరూ డేంజర్ జోన్ లోకి రావాల్సి వచ్చింది.

సేఫ్ జోన్ లో ఉన్న ఇంటిసభ్యులు డేంజర్ జోన్ లో ఉన్నవారిని ఓటింగ్ పద్దతి ద్వారా కాపాడాల్సి ఉంటుంది. ఒకవేళ టై అయితే కెప్టెన్ షణ్ముక్ ఓటు వేసి ఒకరిని కాపాడే అవకాశం ఉంటుంది. ఇందులో మొత్తం తొమ్మిది రౌండ్స్ లో ఫస్ట్ కాజల్, సెకండ్ సన్నీ, తర్వాత జెస్సీలు అవుట్ అయ్యారు. వరుసగా విశ్వ, సిరి, పింకీ, రవి, మానస్ , శ్రీరామ్ లు కూడా గేమ్ నుంచీ అవుట్ అయ్యేసరికి అనీమాస్టర్ కి ఈవారం ఇమ్యూనిటీ లభించింది. అంతేకాదు, ఇక్కడే బిగ్ బాస్ మరో ట్విస్ట్ కూడా ఇచ్చాడు.

అనీమాస్టర్ హోస్ట్ ద్వారా పొందిన స్పెషల్ పవర్ తో మరొకరిని సేఫ్ చేయచ్చని అది ఉపయోగించి ఒకర్ని సేవ్ చేయమని చెప్పాడు బిగ్ బాస్. దీంతో మానస్ పేరు చెప్పింది అనిమాస్టర్. లెటర్స్ టాస్క్ వచ్చినపుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నాకు లెటర్ ఇచ్చి తను నామినేట్ అయ్యాడని, ఇప్పుడు పే బ్యాక్ ఇవ్వాల్సిన టైమ్ వచ్చిందని చెప్తూ మానస్ ని సేవ్ చేసింది అనీమాస్టర్. దీంతో హౌస్ మేట్స్ అందరూ కూడా ఏకీభవించారు. అదీవిషయం.

[yop_poll id=”5″]

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus