హెబ్బా పటేల్ టైటిల్ పాత్రలో రూపొందిన సోషియా ఫాంటసీ ఎంటర్ టైనర్ “ఏంజల్”. నాగఅన్వేష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంతో “బాహుబలి” చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన పళని దర్శకుడిగా పరిచయమయ్యాడు. దాదాపు 25 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ : ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో డెవెలప్ మెంట్ వర్క్స్ కోసం చేపట్టిన తవ్వకాల్లో ఒక అందమైన విగ్రహం దొరుకుతుంది. మట్టి విగ్రహమే అయినప్పటికీ.. విగ్రహం అందాన్ని చూసి విస్తుబోతాడు లోకల్ స్మగ్లర్ హరీష్ భాయ్ (షాయాజీ షిండే). లేట్ చేయకుండా ఆఫ్రికన్ బ్యాచ్ కి అయిదు కోట్లకు బేరం పెట్టి.. మూడు కోట్లు అడ్వాన్స్ కూడా తీసుకొంటాడు. అయితే.. విగ్రహాన్ని హైద్రాబాద్ తీసుకెళ్లడానికి పోలీస్ చెక్ పోస్ట్ భయం ఉండడంతో ఆ పనికోసం నానీని (నాగఅన్వేష్)ను హైర్ చేసుకొంటాడు.
తన చిన్ననాటి స్నేహితుడు గిరి (సప్తగిరి)తో కలిసి అంబులెన్స్ లో విగ్రహాన్ని తీసుకొని హైద్రాబాద్ బయలుదేరిన నానీ మధ్య మార్గంలో జరిగిన యాక్సిడెంట్ కారణంగా అడవిలో ఉండిపోతారు. అక్కడే విగ్రహానికి ప్రాణం వచ్చి నక్షత్ర (హెబ్బా పటేల్)లా తయారవుతుంది. ఇక అక్కడ మొదలైన కన్ఫ్యూజన్ డ్రామాకి నందు (మరో హెబ్బా పటేల్)తో సరికొత్త కోణం బయటపడుతుంది. చివరికి ఏం జరిగింది? ఇంతకీ నందు ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానమే “ఏంజల్” చిత్రం.
నటీనటుల పనితీరు : టైటిల్ పాత్రలో హెబ్బా నిజంగా ఏంజల్ లో లేకపోయినా.. నటన పరంగా పర్వాలేదనిపించుకొంది. అమ్మడు తన స్ట్రక్చర్ మీద కాన్సన్ ట్రేట్ చేయాల్సిన సమయం వచ్చింది. మొదటి చిత్రంతో పోల్చి చూస్తే నటుడిగా నాగఅన్వేష్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. డిక్షన్, యాక్టింగ్ విషయాల్లో పర్వాలేదనిపించుకొన్నాడు. ఎమోషన్స్ విషయంలో ఇంకా వర్క్ చేయాల్సి ఉంది. అయితే.. ఈ సినిమాతో హీరోగా తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకోవాలని నాగఅన్వేష్ చేసిన ప్రయత్నం కొంత మేరకు సత్ఫలితాన్నిచ్చింది. సప్తగిరి కామెడీ మరీ రొటీన్ అయిపోవడం వల్లనో లేక అతడి డైలాగ్ వెర్షన్ మీద డైరెక్షన్ అండ్ రైటర్స్ డిపార్ట్ మెంట్ సరిగా వర్క్ చేయకపోవడం వల్లనో ఏమో కానీ పెద్ద ఎంటర్ టైనింగ్ గా లేదు. షాయాజీ షిండే, ప్రదీప్ రావత్ వంటి సీజన్డ్ ఆర్టిస్ట్స్ చేత పండించాలనుకొన్న కామెడీ కూడా సరిగా వర్కవుట్ అవ్వలేదు.
సాంకేతికవర్గం పనితీరు : భీమ్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ.. పాటలు మాత్రం ఒక్కటి కూడా థియేటర్ నుంచి బయటకు వెళ్ళాక కనీసం గుర్తుకు వచ్చే స్థాయిలో కూడా లేవు. గుణశేకరణ్ సినిమాటోగ్రఫీ వేల్యూస్ బాగున్నాయి. అయితే.. సీజీ షాట్స్ విషయంలో సరిగా జాగ్రత్త తీసుకొని కారణంగా ముమెంట్ ఎక్కువగా ఉంటుంది. గ్రీన్ మేట్ షాట్స్ కోసం ఖర్చు చేసిన స్థాయిలో కేర్ కూడా తీసుకొని ఉంటే అవుట్ పుట్ వేరే లెవల్ లో ఉండేది.
సినిమా నిడివి అనవసరమైన కామెడీ సీన్స్ కోసం, కమర్షియాలిటీ కోసం పెంచుకుంటూ పోయారు, అందువల్ల ఇంట్రెస్ట్ గా అనిపించకపోవడం అటుంచితే సినిమా మాగ్జిమమ్ బోర్ కొడుతుంది. దర్శకుడు పళని “బాహుబలి” చిత్రానికి రాజమౌళి వద్ద వర్క్ చేసి కేవలం సీజీ షాట్స్ ఎలా తీయాలో నేర్చుకొన్నాడేమో అనిపిస్తుంది. కథలో బలం లేదు, స్క్రీన్ ప్లే లో దమ్ము లేదు.. ఓవరాల్ గా సినిమాలో మేటర్ లేదు. స్క్రీన్ ప్లే కోసం “సాగర కన్య సాహసవీరుడు, యమదొంగ” చిత్రాలను ఇష్టమొచ్చినట్లు వాడేసిన పళని.. కథనాన్ని ఏమాత్రం ఆసక్తికరంగా నడిపించలేకపోవడం గమనార్హం. ఇక ప్రీ క్లైమాక్స్ కోసం రాసుకొన్న కన్ఫ్యూజన్ కామెడీ ఎపిసోడ్ మొత్తం ప్రేక్షకుడి బుర్ర వేడెక్కిస్తుంది.
విశ్లేషణ : హెబ్బా అందాల ప్రదర్శన, స్లో మోషన్ షాట్స్ ను ఆమె యద ఎత్తులపై కాన్సన్ ట్రేట్ చేస్తూ పెట్టిన క్లోజప్ షాట్స్ మినహా ఆసక్తికర అంశం ఒక్కటీ లేని “ఏంజల్”ను ఈవారం పోటీలో నిలదొక్కుకోవడం కష్టమే.