Anil Ravipudi, Mahesh Babu: ఆ కామెంట్లపై అనిల్ రావిపూడి అభిప్రాయమిదే!

మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కగా నిర్మాతకు ఈ సినిమా మంచి లాభాలను అందించింది. ఎఫ్3 ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి సినిమాకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ తాను రాజేంద్ర ప్రసాద్ ను డాడీ అని పిలుస్తానని తన డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమాలో ఆయన ఉంటారని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

ఎఫ్3 లో నిజాయితీ ఉన్న పోలీస్ ఆఫీసర్ రోల్ లో ఆయన నటిస్తున్నారని అనిల్ రావిపూడి కామెంట్లు చేశారు. ఎఫ్3 సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తే ఎఫ్4 సినిమా తీస్తానని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. తాను కామెడీ సినిమాలే కాకుండా యాక్షన్ సినిమాలు కూడా తీస్తానని అనిల్ రావిపూడి తెలిపారు. ఎఫ్3 షూటింగ్ అంతా ఇండియాలోనే జరిగిందని కరోనా వల్ల ఫలక్ నుమా ప్యాలెస్ లో ఈ సినిమా షూటింగ్ ఎక్కువ రోజులు జరిగిందని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.

ఇంట్లో సినిమాల గురించి ఎక్కువగా చర్చ జరగదని తన భార్య ఏ సినిమాను తక్కువగా చూడదని అనిల్ అన్నారు. డబ్బు చుట్టూ జరిగే ఫన్, ఫ్రస్టేషన్ తో ఎఫ్3 తెరకెక్కిందని అనిల్ రావిపూడి వెల్లడించారు. తాను బడ్జెట్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తానని ఏదీ వృథా చేయనని అనిల్ రావిపూడి అన్నారు. అవకాశం వస్తే ఆర్టిస్టుగా చేయడానికి సిద్ధమేనని అనిల్ రావిపూడి తెలిపారు. లయన్ సినిమా సమయంలో బాలయ్యతో సినిమా అనుకున్నానని అనిల్ చెప్పారు.

సరిలేరు నీకెవ్వరు షూటింగ్ సమయంలో అనిల్ మహేష్ ను కష్టపెట్టారని వచ్చిన వార్తల గురించి ఆయన స్పందిస్తూ అస్సలు లేదని 5 నెలల్లో సరిలేరు నీకెవ్వరు షూటింగ్ జరిగిందని షూటింగ్ సమయంలో మహేష్ బాగా ఎంజాయ్ చేశారని స్పాట్ కు వస్తే మహేష్ నవ్వుతూ ఉండేవారని అనిల్ రావిపూడి కామెంట్లు చేశారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus