Anil Ravipudi: ‘ఎఫ్‌ 4’ గురించి అనిల్ రావిపూడి ఆలోచనలు అలా ఉన్నాయా!

తెలుగులో సీక్వెల్సే తక్కువ అనుకుంటున్న సమయంలో ‘ఎఫ్ 2’కి సీక్వెల్‌గా ‘ఎఫ్‌ 3’ని తీసుకొచ్చారు అనిల్‌ రావిపూడి. ఇక అలాంటి సినిమాలకు విజయావకాశాలు తక్కువ అనుకుంటుండగా ఆ సినిమా కూడా విజయం సాధించేసింది. దీంతో తెలుగునాట ఫ్రాంచైజీ అనే మాట వినపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమాకు మరో సీక్వెల్‌ రెడీ చేస్తున్నాం అని ప్రకటించేశారు. అదే ‘ఎఫ్‌ 4’. ఈ సినిమాలో కథేంటి, కథనమేంటి, ఎప్పుడు అనే ప్రశ్నలు మొదలయ్యాయి. వాటికి ఇప్పుడు మరో ప్రశ్న యాడ్‌ అయ్యింది. అదే హీరోయిన్లు ఎవరు? అని.

ఈ కొత్త ప్రశ్నకు కారణం దర్శకుడు అనిల్‌ రావిపూడినే. ఇటీవల అనిల్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాకే ‘ఎఫ్ 4’ ఉంటుంది అని చెప్పారు. అయితే ఈ సీజ‌న్‌లో వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్‌ కంటిన్యూ అవుతారని, త‌మ‌న్నా, మెహ‌రీన్ పాత్ర‌ల‌కు రీప్లేస్‌మెంట్‌ ఉంటుందని చెప్పకనే చెప్పారు అనిల్‌ రావిపూడి. ‘ఎఫ్ 4 రావ‌డానికి మ‌రో రెండేళ్ల‌యినా ప‌డుతుంది. ఈలోగా చాలా మార్పులు జ‌ర‌గొచ్చు. ఈ క్రమంలో హీరోయిన్లు మారే అవ‌కాశం ఉంది“ అని తేల్చేశారట అనిల్‌ రావిపూడి

అనిల్‌ ఆలోచనలూ కరెక్టే అంటున్నారు టాలీవుడ్‌ పరిశీలకలు. రెండేళ్ల‌ తర్వాత త‌మ‌న్నా స్టార్ డ‌మ్ పరిస్థితి చెప్పలేం, మెహరీన్‌ పరిస్థితీ అంతంతమాత్రంగతానే ఉంది. అలాంటి సమయంలో నాయికలుగా కొత్తవాళ్లను తీసుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారు. ఆ లెక్కన ‘ఎఫ్‌ 4’లో హీరోయిన్ల మార్పు అయితే పక్కా అని చెప్పొచ్చు. ‘ఎఫ్‌ 2’కి, ‘ఎఫ్‌ 3’ కథకే సంబంధం లేదు. ఆ లెక్కన ‘ఎఫ్ 4’ కథ కూడా మారుతుంది. కాబట్టి హీరోయిన్లు మారినా ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు.

మరోవైపు ‘ఎఫ్ 2’ని ఓ ఫ్రాంచైజీగా ఎప్ప‌టికీ కొన‌సాగించాల‌న్న‌ది అనిల్ రావిపూడి, దిల్‌ రాజు ఆలోచటన. డ‌బ్బులు వ‌స్తున్నంత వ‌ర‌కూ ఆ క్రేజ్‌ని వాడేసే పనిలో ఉన్నారట. ఇక అనిల్‌ రావిపూడి ‘ఎఫ్‌ 3’, ఎఫ్‌ 4’కి మధ్య చేసే ఆ రెండు సినిమాలేంటో మీకు తెలిసే ఉంటాయి. త్వ‌ర‌లో బాల‌కృష్ణ‌తో ఓ సినిమా చేయ‌బోతున్నారు అనిల్. ఆ త‌ర‌వాత దిల్ రాజు నిర్మాణంలో వేరే హీరోతో ఓ సినిమా ఉంటుందట. ఆ తర్వాతే ‘ఎఫ్‌ 4’.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus