Anil Ravipudi: అనిల్ రావిపూడి ఆ విషయంలో మారక తప్పదా?

టాలీవుడ్ దర్శకులలో ఒకరైన అనిల్ రావిపూడికి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. పటాస్ నుంచి ఎఫ్3 వరకు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అయితే ఎఫ్2 సినిమా సక్సెస్ అయిన స్థాయిలో ఎఫ్3 సినిమా సక్సెస్ సాధించలేదు. ఎఫ్3 విడుదలైన తర్వాత వారం మేజర్, విక్రమ్ సినిమాలు థియేటర్లలో విడుదలై సక్సెస్ సాధించాయి. ఈ సినిమాల ఎఫెక్ట్ వల్ల ఎఫ్3 ఫుల్ రన్ లో అబవ్ యావరేజ్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉంది.

అనిల్ రావిపూడి ఎఫ్4 సినిమా చేస్తానని చెప్పడం అభిమానులలో చాలామందికి నచ్చడం లేదు. అనిల్ రావిపూడి ఫన్ ఫ్రాంఛైజీని కొనసాగిస్తానని చెప్పడం బాగానే ఉన్నా ఎఫ్2, ఎఫ్3 సినిమాలు నచ్చని ప్రేక్షకులు ఎఫ్4 సినిమాలో కొత్తగా ఏముంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఎఫ్3 సినిమా ఫుల్ రన్ లో పలు ఏరియాలలో నష్టాలను మిగిల్చే అవకాశం ఉంది. ఎఫ్4 ను ప్రకటించిన అనిల్ రావిపూడీ ఈ సినిమా తెరకెక్కించినా ఎఫ్4 భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు తన శైలికి భిన్నమైన కథతో అనిల్ రావిపూడి బాలయ్యతో సినిమా తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాలో బాలయ్య కూతురిగా శ్రీలీల కనిపించనున్నారు. పటాస్ తో కళ్యాణ్ రామ్ కు హిట్టిచ్చిన అనిల్ రావిపూడి బాలయ్యకు కూడా కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సెప్టెంబర్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.

సాధారణంగా బాలయ్య తన సినిమాల షూటింగ్ ను వేగంగా పూర్తి చేస్తారు. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus