టాలీవుడ్లో సీక్వెల్స్ కు ఉన్న బ్యాడ్ సెంటిమెంట్ ను చెరిపేశారు అనిల్ రావిపూడి. ‘ఎఫ్ 2’ సూపర్ హిట్ అవ్వడంతో చేసిన ‘ఎఫ్ 3’ కూడా మంచి ఫలితాన్నే అందుకుంది. ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. ‘ఎఫ్ 4′ కూడా ఉంటుందని నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పకనే చెప్పారు.’ఎఫ్ 2’ ని ఓ ఫ్రాంచైజీ గా కొనసాగించాలి అనేది అనిల్ రావిపూడి ఆలోచన.
డబ్బులు వస్తున్నాయి కాబట్టి నిర్మాత దిల్ రాజు కూడా హ్యాపీగా ఓకే అంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ ‘ఎఫ్ 4’ కి వచ్చేసారి అనిల్ రావిపూడి హీరోయిన్లలో మార్పు ఉంటుంది అని చెప్పకనే చెప్పారు.ఇటీవల ఓ సందర్భంలో “ఎఫ్ 4 రావడానికి మరో రెండేళ్లయినా పట్టొచ్చు. ‘ఎఫ్4’ కి మార్పులు చోటు చేసుకోవచ్చు. వెంకీ, వరుణ్‌లు అలాగే కొనసాగుతారు. అయితే హీరోయిన్లు మారే అవకాశం ఉంది“ అని అనిల్ చెప్పాడు.
‘ఎఫ్4’ కి రెండేళ్లు టైం పడుతుంది కాబట్టి.. తమన్నా,మెహరీన్ లు ఫామ్లో ఉంటారో లేదో అన్నది అనిల్ ఉద్దేశం కావచ్చు. ‘ఎఫ్3’ విషయంలో తమన్నాతో అనిల్ కు కొంచెం గ్యాప్ వచ్చింది. మెహరీన్ విషయంలో అలాంటిది ఏమీ జరగలేదు కానీ ఆమెకి ఇప్పుడు యూత్ లో క్రేజ్ లేదు. ‘ఎఫ్ 2’ లో బికినీ వేసుకుని గ్లామర్ రచ్చ చేసిన ఈ భామలకు ‘ఎఫ్3’ లో ఆ ఛాన్స్ దక్కలేదు. దాంతో ఈ భామలు సినిమాలో వచ్చినప్పుడు ప్రేక్షకులు ఇబ్బంది ఫీలయ్యారు.
అందుకే ‘ఎఫ్ 4’ లో వేరే హీరోయిన్లను ఎంపిక చేసుకునే ఆలోచనలో అనిల్ రావిపూడి ఉన్నాడు. కాకపోతే అనిల్ రావిపూడి కామెంట్స్ మిస్ ఫైర్ కూడా అయ్యాయి. ‘ఎఫ్3’ లో కంటెంట్ ఏమీ లేకపోయినా హ్యూమర్ తో నడిపాడు అనిల్ రావిపూడి. అది కూడా లాజిక్స్ కు అందని కామెడీ. వెంకీ, వరుణ్ ల రోల్స్ కృష్ణ భగవాన్, అల్లరి నరేష్ చేసినా సూట్ అవుతుంది, హీరోయిన్ల విషయంలో కూడా తమన్నా, మెహ్రీన్ లు ఎక్కువే..
వీళ్ళని తప్పిస్తాను అని చెప్పడం అనిల్ రావిపూడి ఓవర్ యాక్షన్ కు నిదర్శనం అన్నట్టు కామెంట్లు చేస్తున్నారు కొందరు నెటిజన్లు. నిజంగా కృష్ణ భగవాన్, అల్లరి నరేష్ లను పెడితే జనాలు థియేటర్లకు వస్తారా? పైగా హీరోయిన్లు చేస్తారా? మానేస్తారా అన్నది వాళ్ళ ఇష్టం. నిజంగానే అనిల్ రావిపూడి పై ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగానే వస్తుంటాయి.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!