Animal: అలా ప్లాన్ చేస్తే మాత్రం స్పిరిట్ మూవీ సంచలనాలు సృష్టిస్తుందా?

రణ్ బీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కిన యానిమల్ మూవీ ట్రైలర్ ఆకట్టుకోగా ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉండగా యానిమల్ మూవీ ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో స్పిరిట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

యానిమల్ (Animal) సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా స్పిరిట్ ఉంటుందా అనే ప్రశ్న ఎదురుకాగా దర్శకుడు సందీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్పిరిట్ మూవీ విషయంలో ఇప్పటివరకు అలాంటి ఆలోచనలు అయితే ఏమీ లేవని అవకాశం ఉంటే మాత్రం కచ్చితంగా ప్లాన్ చేస్తానని సందీప్ రెడ్డి వంగా తెలిపారు. యానిమల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా స్పిరిట్ తెరకెక్కితే ఆ మూవీ సంచలనాలు సృష్టించే అవకాశాలు మరింత పెరుగుతాయి.

స్పిరిటి మూవీ సెట్స్ పైకి వెళ్లడానికి మరో 9 నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఈ సినిమా సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబో మూవీ 2025 సెకండ్ హాఫ్ లో లేదా 2026 ఫస్ట్ హాఫ్ లో రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.

ప్రభాస్ ను సందీప్ రెడ్డి వంగా కొత్తగా చూపించనున్నారని తెలుస్తోంది. స్పిరిట్ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. యానిమల్ మూవీ రిలీజ్ తర్వాత స్పిరిట్ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రభాస్ పారితోషికం 120 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా సలార్ హిట్టైతే మాత్రం ప్రభాస్ పారితోషికం మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus