Animal OTT: యానిమల్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడేనా?

రణ్ బీర్ కపూర్, రష్మిక హీరో హీరోయిన్లుగా సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కిన యానిమల్ మూవీ నేడు థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు రికార్డ్ స్థాయిలో ఉండే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. యానిమల్ మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో తెలియాల్సి ఉంది. యానిమల్ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. భారీ మొత్తం ఖర్చు చేసి నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేయడం గమనార్హం. 2024 సంవత్సరం జనవరి నెల 26వ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం అందుతోంది. హిందీ సినిమాల రూల్స్ ప్రకారం ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్ కావాల్సి ఉంది.

యానిమల్ సినిమా రిలీజ్ విషయంలో సైతం ఇదే నిబంధనను ఫాలో అవుతున్నారని సమాచారం అందుతోంది. యానిమల్ మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. యానిమల్ ఓటీటీ వెర్షన్ దాదాపుగా నాలుగు గంటల రన్ టైమ్ తో స్ట్రీమింగ్ కానుందని సమాచారం అందుతోంది. యానిమల్ సినిమాలోని కొన్ని సీన్లు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి.

యానిమల్ మూవీ (Animal) అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుండటం గమనార్హం. ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమాకు బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. వీక్ డేస్ లో ఈ సినిమా బుకింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. యానిమల్ మూవీ విషయంలో సందీప్ రెడ్డి వంగా నమ్మకం నిజమైంది. యానిమల్ సినిమా సక్సెస్ తో సందీప్ రెడ్డి వంగా తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus