Animal: ‘యానిమల్‌’ సినిమా వావ్‌ మూమెంట్‌… స్టార్లకు కూడా సాధ్యం కానిది!

స్పెషల్‌ షోలు… ఈ మాట ఎక్కువగా మనం సినిమా విడుదలకు ముందు, విడుదలైన రోజు, సినిమా బాగుంటే ఆ వీకెండ్‌ వింటుంటాం. అయితే సినిమా రిలీజ్ అయిన వారం తర్వాత… పక్కాగా చెప్పాలంటే పది రోజుల తర్వాత ఓ సినిమాకు స్పెషల్‌ షోలు పడ్డాయంటే నమ్ముతారా? పడ్డాయి అని చెప్పేశాం కాబట్టి మీరు నమ్మాల్సిందే. అంతటి ఫీట్‌ సాధించిన సినిమా ‘యానిమల్‌’. దేశం మొత్తం ఇప్పుడు ఆ సినిమా ఫీవర్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ ఆదివారం అదిరిపోయే ఫీట్‌ సాధించిందీ చిత్రం.

సినిమా విజయం పక్కా అని రిలీజ్‌కు ముందు అనుకునే సినిమాలు తక్కువగా ఉంటాయి. అలాంటివాటిలో ‘యానిమల్‌’ ఒకటి. ఆ సినిమా దర్శకుడి గత సినిమాలు ఒక కారణం అయితే, టీజర్‌ – ట్రైలర్‌ సృష్టించిన హంగామా ఇంకో కారణం. అయితే రిలీజ్‌ అయ్యాక సినిమా సుమారు రూ. 700 కోట్ల ఘనత సాధించింది. ఈ వారంతంతలో రూ. వెయ్యి కోట్లు పక్కా అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆ విషయం పక్కనపెడితే ముంబయిలో ఆదివారం పడిన స్పెషల్‌ షోల సంగతి ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు ముంబయిలోని మల్టీప్లెక్స్‌లో సినిమా స్పెషల్‌ షో వేశారు. ఉదయం 4 దాకా షోలు పడ్డాయి అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఆ సమయంలో కూడా స్క్రీన్లు హౌస్‌ఫుల్‌ అవ్వడం. ఇదంతా చూస్తుంటే ఉత్తరాది ఆడియన్స్‌ ఈ సినిమాను ఎంతలా అభిమానించారో మీకు తెలుస్తుంది. ఇంత మూవీ మేనియాను షారుఖ్ ఖాన్‌, అమీర్ ఖాన్‌, సల్మాన్ ఖాన్‌ లాంటి స్టార్ల సినిమాల రిలీజ్‌ అప్పుడు కూడా చూడలేదు అని అంటున్నారు.

తొలి వారం మొత్తం (Animal) ‘యానిమల్’దే కాగా, రెండో వారం కూడా ఆ సినిమాకే అవకాశం. ఎందుకంటే ‘సలార్‌’, ‘డంకీ’ మూడోవారానికి కానీ థియేటర్లకు రావు. ఈ జోరు కొనసాగితే ‘జవాన్‌’ రికార్డులను యానిమల్‌ బద్దలుకొట్టడం పక్కా. ఆ సినిమా రూ. 1150 కోట్లు వరకు వసూలు చేయడం గమనార్హం.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus